rohini court
-
తీహార్ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్‌స్టర్ టిల్లు మృతి
ఢిల్లీ: రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్‌పూరియా Tillu Tajpuriya మృతి చెందాడు. తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్‌లో అతను చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయిందని వెల్లడించారు. తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో తజ్‌పూరియా తీవ్రంగా గాయపడ్డాడు. యోగేష్ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. Delhi's Rohini court shootout accused jailed gangster Tillu Tajpuriya killed after he was attacked by rival gang members Yogesh Tunda and others in Tihar jail. He was taken to Delhi's Deen Dayal Upadhyay Hospital, where he was declared dead. Further investigation underway by… pic.twitter.com/70cVYUD0rk — ANI (@ANI) May 2, 2023 ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ అయిన గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్‌లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్పూరియానే. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. ఇదీ చదవండి: సంచలనంగా చనిపోయిన వ్యక్తి లేఖ! -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్‌పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్‌లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
పొరుగింటి లాయర్‌పై కక్షతో..
న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉండే లాయర్‌పై కక్ష పెంచుకుని, అతడిని చంపేందుకు ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన డీఆర్డీవో (రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ) సీనియర్ శాస్త్రవేత్త ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్డీవో సీనియర్ సైంటిస్ట్ భరత్ భూషణ్ కటారియా (47), లాయర్‌గా పనిచేసే అమిత్ వశిష్ట్ స్థానిక అశోక్ విహార్ ఫేజ్–1 భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పాత తగాదాలున్న వీరిద్దరూ పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. అయితే, లాయర్ వశిష్ట్‌ను చంపాలని కటారియా ప్రణాళిక వేశాడు. మార్కెట్లో సులువుగా దొరికే రసాయనాలను వాడి టిఫిన్ బాక్స్ బాంబు తయారు చేశాడు. ఈ నెల 9వ తేదీన కటారియా లాయర్ మాదిరి దుస్తులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి కోర్టు భవనంలో వశిష్ట్ హాజరయ్యే కోర్ట్ నంబర్ 102లో బాంబున్న బ్యాగ్‌ను వదిలేసి వచ్చాడు. కానీ, సరిగ్గా అమర్చని కారణంగా బాంబు బదులు డిటొనేటర్ మాత్రమే పేలింది. దీంతో ఒకరు గాయపడ్డారు. దర్యాప్తు చేపట్టిన విచారణ బృందాలు..ఘటన జరిగిన రోజున కోర్టు సీసీ ఫుటేజీని పరిశీలించి కటారియానే బాధ్యుడిగా తేల్చాయి. బాంబు తయారీలో వాడిన సామగ్రి, రసాయనాలు, రిమోట్ తదితరాలు కటారియా ఇంట్లో లభించాయి. ఈ మేరకు శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియాను శనివారం అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. -
కోర్టులో షూటౌట్; వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జితేందర్‌ను శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగా కాల్చి చంపిన సంగతి విదితమే. అతడి హత్యకు ప్రధాన సూత్రధారుడిగా మరో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పూరియాను పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్టు సమాచారం. రోహిణి కోర్టు షూటౌట్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా టిల్లు తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టిల్లు తాజ్పూరియా ప్రస్తుతం తీహార్‌లోని మండోలా జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే జితేందర్ హత్యకు సంబంధించిన విషయాలను తన ఇద్దరు అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు అతడు తెలుసుకున్నట్టు సమాచారం. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. రోహిణి కోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు వంటి ప్రశ్నలు.. తన ఇద్దరు అనుచరులను ఫోన్లో టిల్లు అడిగినట్టు తెలుస్తోంది. రోహిణి కోర్టుకు చేరుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఉమాంగ్, వినయ్‌లను ఆదేశించాడట. రోహిణి కోర్టులో షూటౌట్‌కు కొద్ది నిమిషాల ముందు కూడా వారికి కాల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దాడి చేసిన ఇద్దరూ కోర్టు గది లోపల కూర్చున్నారని.. కోర్టు లోపల, బయటా పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలుసుకుని.. తన అనుచరులు తప్పించుకోవడం కష్టమని టిల్లు భావించాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి వారి ఆచూకీ గురించి అడిగాడు. వారు పార్కింగ్ స్థలంలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని టిల్లు సూచించాడ’ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు? -
ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్ టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
కోర్టులో గ్యాంగ్‌వార్.. గుండెలోకి బుల్లెట్లు
న్యూఢిల్లీ: న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ జరిగింది. కోర్టు ప్రాంగణంలోనే దారుణం చోటుచేసుకుంది. కోర్టు హాజరుకు తీసుకొస్తున్న విచారణ ఖైదీపై ఓ కిరాయి హంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణీ కోర్టులో శనివారం ఉదయం జరిగింది. రాజేశ్ దుర్ముత్ అనే విచారణలో ఉన్న ఖైదీని హర్యానా పోలీసులు కోర్టుకు తీసుకొస్తుండగా అదే సమయంలో కోర్టు వద్ద ఉన్న పెద్ద సమూహంలో నుంచి దూసుకొచ్చిన మోహిత్ అనే వ్యక్తి నాటు తుపాకీ తీసుకొని కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్లు అతడి భుజంలోకి, గుండెలోకి దూసుకెళ్లాయి. దీంతో అతడు చనిపోయాడు. కాల్పులు జరిపిన కిరాయి హంతకుడు అంతటితో ఆగకుండా మరో తుపాకీ తీసి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ తుపాకీ పేలలేదు. దీంతో అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా చివరికి దొరికిపోయాడు. బాధితుడు దుర్ముత్ నీతు దాబోడియా గ్యాంగ్‌లో సభ్యుడు. ఇతడిపై 16 దొంగతనం, హత్యలు, దోచుకోవడంలాంటి కేసులు ఉన్నాయి. రెండు రోజుల ముందు నుంచే మోహిత్ ప్లాన్ చేసుకొని పోలీసుల వాహనాన్ని అనుసరించి ఈ హత్య చేసినట్లు తెలిసింది.