వొకేషనల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వొకేషనల్ సెంటర్‌ను రోహిణి సెక్టార్-3లోని జేజే కాలనీలో ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి చౌహాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ టీడీడీపీఎల్ పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏడో తరగతి వరకు ఎలక్ట్రీషియన్ కోర్సులతోపాటు ట్యూ షన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రీషియన్‌లో రెండు నెలల షార్ట్‌టర్మ్ కోర్సుతోపాటు ఆరునెలల లాంగ్‌టర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిలో ఏడాదికి 220 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఏఎన్‌కే అనే స్వచ్ఛందసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగోల్‌పురిలో ఐటీఐ భవన నిర్మాణం కొనసాగుతున్నట్టు చౌహాన్ పేర్కొన్నారు. నూతన భవన ప్రారంభంతో స్థానికులతోపాటు, పిరాడిగఢి, ఉద్యోగ్‌నగర్, రాణిభాగ్, రోహిణి, బుద్ధవిహార్, సుల్తాన్‌పురి, మదీనాపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యుత్ టారిఫ్‌ల్లో 73 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో టీడీడీపీఎల్ కార్యనిర్వాహణ అధికారి పర్వీర్ సిన్హా, ఇతర అధికారులు పాల్గొన్నారు.