rolles
-
గ్రానైట్ లారీ బోల్తా..
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం సమీపంలో బుధవారం వేకువజామున గ్రానైట్ రాయితో కాకినాడ వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. లారీపై ఉన్న గ్రానైట్ రాయి క్యాబిన్పైకి దూసుకెళ్లటంతో డ్రైవర్, క్లీనర్ అందులో చిక్కుకున్నారు. స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి అక్కడికి చేరుకున్నారు. పొక్లెయినర్ సాయంతో రాయిని పక్కకు లాగారు. నుజ్జయిన క్యాబిన్ నుంచి బాధితులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. (తణుకు) -
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
-
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
కృష్ణా: గేర్ రాడ్డు విరిగి పోవడంతో అదుపుతప్పిన స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. 'కేర్ అండ్ షేర్' స్కూల్ బస్సు విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదవశాత్తు గేర్ రాడ్డు విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు, మరో ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గన్నవరం)