పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం సమీపంలో బుధవారం వేకువజామున గ్రానైట్ రాయితో కాకినాడ వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది.
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం సమీపంలో బుధవారం వేకువజామున గ్రానైట్ రాయితో కాకినాడ వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. లారీపై ఉన్న గ్రానైట్ రాయి క్యాబిన్‌పైకి దూసుకెళ్లటంతో డ్రైవర్, క్లీనర్ అందులో చిక్కుకున్నారు. స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి అక్కడికి చేరుకున్నారు. పొక్లెయినర్ సాయంతో రాయిని పక్కకు లాగారు. నుజ్జయిన క్యాబిన్ నుంచి బాధితులను రక్షించేందుకు యత్నిస్తున్నారు.
(తణుకు)