rolugunta
-
116 కేజీల గంజాయి స్వాధీనం
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకి పురం గ్రామంలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఉండే ఓ పరిశ్రమ వద్ద జరిపిన సోదాల్లో 116 కేజీల గంజాయి బయటపడింది. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఓ బైక్, మరో కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
140 కేజీల గంజాయి పట్టివేత
రోలుగుంట: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట సమీపంలో శుక్రవారం గంజాయి పట్టుబడింది. సిందేటి వెంకటరమణ(27) అనే యువకుడి నుంచి 140 కేజీల గంజాయి, రూ. 8 వేల నగదు, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకతో మరో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
55 కిలోల గంజాయి పట్టివేత
రోలుగుంట (విశాఖపట్టణం) : విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట గ్రామం వద్ద సుమారు 55 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. సోమవారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన మూడు బస్తాల్లో గంజాయి నింపుకుని వాహనం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు అపరిచితులు కనిపించారు. వారిని అనుమానించి ప్రశ్నిస్తుండగా ఒక వ్యక్తి పరారయ్యాడు. మిగతా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, బస్తాల్లో పరీక్షించగా గంజాయి కనిపించింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయిని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు ఏజెన్సీ మహిళల ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం : గత పదేళ్లుగా మధ్యాహ్న భోజనం వండుతున్న తమని కాదని.. కొత్తగా మరో ఇద్దరు మహిళలను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో.. మనస్తాపం చెందిన ఇద్దరు ఏజెన్సీ మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. పాఠశాల భవనం పైకి ఎక్కి తమను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని.. లేకపోతె ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని సర్దిచెప్పి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న కస్తూర్బా పాఠశాలలో పదేళ్లుగా వంట చేస్తున్న కాంతమ్మ(52), అమ్మాజి(42)లను అకారణంగా తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నట్లు తెలవడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో వారు పాఠశాల భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు. -
12 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్టణం : విశాఖ జిల్లా రోలుగుంటలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రోలుగుంట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీనలు నిర్వహించారు. అదే సమయంలో బీబీపట్నం వైపు నుంచి బైక్పై వచ్చిన ఒక వ్యక్తిని సోదా చేయగా 12 కిలోల గంజాయి లభ్యమైంది. అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన కర్పూరపు వరప్రసాద్ అని తెలిసింది. (రోలుగుంట) -
320 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ : విశాఖపట్నం జిల్లా రోలుగుంట వద్ద మూడు క్వింటాళ్లకు పైగా గంజాయిని మంగళవారం తెల్లవారు జామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీబీ పట్నం మండలం వడ్డిత గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 320 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు కాపు కాచి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆటోను సీజ్ చేశారు. (రోలుగుంట)