roopali
-
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. -
గన్ పెట్టి బెదిరించాడు
ఎంతో పేరొచ్చింది డీజే వృత్తిలో ప్రవేశించి ఎనిమిదేళ్లు దాటింది. నాలుగు వేలకు పైగా షోలు చేశా. దోహా, ఖతార్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లో డీజేగా చేశా. బాలీ వుడ్ నటులు నా ప్రతిభను మెచ్చుకున్నారు. అహ్మదాబాద్ ఉడాన్ సంస్థ నుంచి ‘ఔట్‌స్టాండింగ్ ఫిమేల్ డీజే’, మోస్ట్ గ్లామరస్ గుజరాతీ డీజే అవార్డులు అందుకున్నా. ఒకప్పుడు ఇది మన సంప్రదాయం కాదన్నవారే ఇప్పుడు రూపాలీ మాకు గర్వకారణమంటున్నారు. మ్యూజిక్‌లో ఎన్నో ప్రయోగాలు చేయాలని ఉంది. గుజరాతీ, పంజాబీ, బాలీవుడ్ సంగీతాన్ని నాదైన శైలిలో ప్లే చేయగలను. ఒక వృద్ధాశ్రమం పెట్టి సేవచేయాలన్నది నా కోరిక. ఎవరైనా రాణించొచ్చు: పురుషుల కంటే మహిళలకు మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. మరి అలాంటిది వారు మ్యూజిక్ రంగంలోకి ఎందుకు రాకూడదు. నిబద్ధత, శ్రమ ఉండాలేకానీ యువతులు కూడా ఇందులో రాణించవచ్చు. ఆదాయం ఎక్కువ. మాది గుజరాత్ రాజధాని గాంధీనగర్ సమీపంలోని బరూచ్. నాన్న ఎస్బీఐలో పనిచేసి రిటైరయ్యారు. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తుండడంతో అక్కడ ప్లే చేసే డీజే మ్యూజిక్‌పై ఇష్టం ఏర్పడింది. ఎలాగైనా డీజే మ్యూజిక్ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. ఇంట్లో చెబితే అమ్మానాన్న ససేమిరా అన్నారు. మన సంప్రదాయం మరిచి డీజేగా పనిచేయడమనే ఆలోచనే వారికి నచ్చలేదు. డీజే అంటే పబ్‌లు, క్లబ్‌లు అర్ధరాత్రి వరకూ తాగి చిందులేయడాలు.. అలాంటివి అవసరమేలేదన్నారు. వారికున్న ఈ దురాభిప్రాయాన్ని మార్చడానికి చాలా కష్టపడ్డా. ఫ్రెండ్స్, బంధువులు కూడా నిరుత్సాహపరిచిన వారే. ఆయనే ఆదిగురువు.. నా భర్త రాహుల్ లేకుంటే నేను లేను. ఆయన అహ్మదాబాద్‌లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. డీజే మ్యూజిక్ చాలా బాగా ప్లే చేసేవారు. ఆయన వద్దనే ఈ విద్య నేర్చుకున్నా. తొలుత చిన్నచిన్న పార్టీల్లో ప్లే చేశా. క్రమేణా మా సాన్నిహిత్యం పెరిగి ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లిచేసుకున్నాం. నన్నెంతో అర్థం చేసుకున్న వ్యక్తి నా భర్తే. ఏ టైమ్‌లో ఇంటికెళ్లినా ఆయనే వంట చేసి భోజనం వడ్డిస్తారు. విచ్చలవిడి సంస్కృతిలో గడిపినా నేను మద్యం, ధూమపానం అలవాటు చేసుకోలేదు. డీజే వృత్తి అంటేనే సబ్‌కాన్షియస్‌లో ఉన్న మనుషుల మధ్య గడపడం. మహిళగా నేనూ ప్రారంభంలో చాలా భయానక పరిస్థితులెదుర్కున్నా. అహ్మదాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో న్యూ ఇయర్ పార్టీలో డీజే ప్లే చేస్తుంటే తాగిన ఓ యువకుడు పదేపదే కజ్రారే.. కజ్రారే పాటను ప్లే చేయమన్నాడు. అప్పటికే పదిసార్లు ఆ పాట వినిపించడంతో ఇక కుదరదన్నా. అంతే జేబులో నుంచి గన్‌తీసి నుదుటకు పెట్టి ప్లే చేస్తావా?లేదా? అని బెదిరించాడు. నాకు ప్రాణం పోయినంత పనైంది. వెంటనే ఫంక్షన్ ఆర్గనైజర్లు అతన్ని తీసుకెళ్లారు. నా కెరీర్లో అత్యంత భయానక స్థితి అదే.