నేల విడిచి సాగు
పూలు పూసే మొక్కలంటే అందరికీ ఇష్టమే. ఉదయం లేవగానే బాల్కనీలో ఉన్న గులాబీ మొక్కకు ఓ పువ్వు కనిపిస్తే... ఓ ఆనందం. టై పైకి పాకిన మల్లెతీగను చూస్తే ఓ సంతోషం. అయితే మక్కువతో మొక్కలు పెంచాలనుకున్న వారికి మెట్రో సిటీలో స్థలాభావం ప్రధాన ఇబ్బంది. అపార్ట్మెంట్లలో మట్టి లభించడం మరో సవుస్య. అనువుగాని చోట మొక్కలెందుకని హోమ్ గార్డెనింగ్‌కు దూరమవుతున్న వారికి ‘పాటింగ్ మిక్స్’ వరంగా మారింది. దీనివల్ల వుట్టి లేకుండానే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే అవకాశం కలుగుతుంది.
విరబూసిన పూలతో ఉన్న మొక్కలను ఎంత సేపరుునా చూస్తూ ఉండిపోవచ్చు. పల్లెవాసికి ఇవి పాత అందాలే అరుునా, మెట్రో నగరాల్లో.. అందునా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లలో ఉంటున్న వారికి వూత్రం ఆ భాగ్యం లేకుండా పోతోంది. ప్రకృతి అందాలకు చోటు ఇవ్వలేక.. పూబాలల సోయుగాన్ని మిస్ అవుతున్నారు. ఇరుకుగా ఉన్న బాల్కనీనే చిన్నపాటి ఉద్యానంగా వూర్చుకునే వారూ ఉన్నారు. అరుుతే వుట్టి కుండీలను మెరుుంటేన్ చేయులేక.. మొక్కల పెంపకానికి దూరం అవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ‘మహాగ్రో’ అనే కంపెనీ తయారు చేసిందే పాటింగ్ మిక్స్. మట్టి లేకుండా మొక్కలను పెంచే ఈ మిక్స్ ఎందరినో ఆకర్షిస్తోంది.
డిమాండ్ ఎందుకంటే...
తక్కువ స్థలం ఉండే అపార్ట్మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్‌తో మొక్కలు పెంచవచ్చు. మార్బుల్, ఖరీదైన ఫ్లోరింగ్‌పై ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది ఐదు రెట్లు తేలికగా కూడా ఉంటుంది. దీంతో కుండీలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుంది. అందుకే పాటింగ్‌మిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇక్రిశాట్లో జొన్నపంట కోసం పాంటింగ్ మిక్స్‌నే వాడుతున్నారు. డీఆర్డీవో, మోన్శాంటో, నేషనల్ పోలీసు అకాడమీ, గౌతమ్ మోడల్ స్కూల్స్ కూడా ఈ మిక్స్‌నే వాడుతున్నాయి. ఈ సాగు చేయాలనుకునేవారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సురభి ఎన్‌క్లేవ్‌లోని మహాగ్రో హార్టిటెక్‌ను సంప్రదించవచ్చు.
ఏమిటీ పాటింగ్ మిక్స్!
కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ (మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తుంది) మిశ్రమమే ఈ పాట్ మిక్స్. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే చాలు. మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. ఎరువుల అవసరం కూడా ఉండదు. ఏడాదిన్నర తర్వాత మొక్క కుండీ పరిమితిని దాటి పెరుగుతుంది. అప్పుడు దానిని వేరే దానిలోకి మార్చుకుంటే సరిపోతుంది.
అందరీ సమస్య అనుకున్నాం...
మాది బందరు. మా అమ్మ గిరిజ లక్ష్మికి మొక్కలంటే ప్రాణం. హైదరాబాద్ వచ్చాక అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. చిన్న బాల్కనీలో, మా అమ్మ మట్టి కుండీలు తెప్పించి మొక్కలు పెట్టింది. వాటికి నీళ్లు పోస్తే ఇల్లంతా బురదే! పైగా నీళ్లు కింది ఇంటి బాల్కనీలోకి వెళ్తే వాళ్లతో తగాదా. నాలుగు రోజులు ఊరికి వెళ్తే మొక్కలన్నీ తోటకూర కాడల్లా వాడిపోయేవి. అపార్ట్మెంట్లలో ఉండే ప్రతి ఒక్కరిదీ ఇదే సమస్య అని భావించిన మా అమ్మ.. దీని పరిష్కారం ఆలోచించింది. అదే పాటింగ్ మిక్స్ తయారీకి కారణమైంది.
కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్
వివిధ పాళ్లలో కలిపి వాటితో మొక్కలు పెంచాం. మొదట్లో లోపాలు కనిపించాయి. నిపుణుల సలహాలు తీసుకున్నాం. 170 ప్రయోగాల తర్వాత మా ప్రయత్నం ఫలించింది. 2012లో పాటింగ్ మిక్స్‌కు అంకురార్పణ జరిగింది. దీన్ని ల్యాబ్ టెస్ట్‌కి పంపిస్తే.., మొక్కల పెంపకానికి ఉపయోగపడే పాట్ మిక్సింగ్‌గా గుర్తించారు. అనతి కాలంలోనే మా మిక్స్‌కు మంచి ఆదరణ లభించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. అమ్మ ఇప్పటికీ అమెరికాకు వెళ్లి మొక్కల పెంపకం సులభతరం చేయడంపై అధ్యయనం చేస్తోంది. మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నా.
- మహాగ్రో సీఈవో కృష్ణకార్తీక్
- వాంకె శ్రీనివాస్