rowthu
-
జగన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పడం సరికాదు
వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు దానవాయిపేట(రాజమహేంద్రవరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు వక్రభాష్యం చేబుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఇలాంటి దిగ్గజారుడు రాజకీయలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యపకాశరావు అన్నారు. శనివారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టి చంద్రబాబు వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మంత్రి పదవి ఆశ చూపారని, తీరా మంత్రి పదివి దక్కకపోవడంతో మానసికంగా కుంగి గుండె పోటుతో మరణించారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక రావడానికి చంద్రబాబే కారకుడని, ఈ ఉప ఎన్నిక దుర్మార్గాన్నికి, సన్మార్గాన్నికి జరగుతున్న ఒక పోరుగా ఆయన అభివర్ణించారు. 2009 శాసన సభ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామని వ్యాఖ్యనించారని, ఇది జరిగిన మరుసటి రోజు సెప్టెంబర్ 2న దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని దీన్ని పై టీడీపీ నేతలు ఏమి వివరణ ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయాల్లో అరోపణలు, ప్రత్య అరోపణలు సహజమని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వచ్చిన అరోపణలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వీకరించి సీబీఐ విచారణకు సిద్ధామని సవాల్ చేశారని ఇప్పుడు నారా లోకేష్ పై వస్తున్న ఆరోపణల పై బాబు నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా శాసన సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్ వీడియోను, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చంద్రబాబుపై చేసిన విమర్శల వీడియోలను మీడియాకు చూపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వసనీత ఉందని, ఇటువంటి విమర్శలకు పార్టీ భయపడ్డేది లేదని, దీన్ని పై నంద్యాల ప్రజలే సరైన తీర్పు చేబుతారని వెల్లడించారు .ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్లు తామాడ సుశీల, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలు కిరణ్ మోహన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ, నగర మహిళ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, పెంకే సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే చాపరాయి బాధితులకు ధైర్యం చెప్పు
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం తనయుడు నారా లోకేష్‌కు దమ్ముంటే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతంలోని చాపరాయి గ్రామానికి వెళ్లి అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన 17 కుటుంబాలను పరామర్శించాలని మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం నగర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు సవాల్ విసిరారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య, సాధారణ వాహనాలు వెళ్లలేని కొండకోనల్లో ఉన్న చాపరాయి గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లి వారిని పరామర్శించడం ఆయన నాయకత్వానికి ప్రతీకని ప్రశంసించారు. బుధవారం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ తండ్రి చాటు బిడ్డగా, ముద్ద పప్పుగా పేరుగాంచిన నారా లోకేష్, వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక పెద్దలు వెళ్లాల్సిన సభకు ఎమ్మెల్సీగా వెళ్లి దొడ్డిదారిని మంత్రి పదవి తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో టీడీపీ మంత్రులు, నేతల వెన్నులో వణుకుపుడుతోందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు కార్పొరేటర్లు మజ్జినూకరత్నం, ఈతకోటి బాపన సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఘనుడు
ఎమ్మెల్సీ ఆదిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రౌతు ధ్వజం అభివృద్ధి అంటే అధికారం కోసం పార్టీ మారడం కాదంటూ చురక సిగ్గుంటే వైఎస్సార్సీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలి సాక్షి, రాజమహేంద్రవరం : తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం నగర వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఆదిరెడ్డి అప్పారావు వైఎస్సార్సీపీ ద్వారా ఎమ్మెల్సీ పదవి తీసుకుని తిరిగి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే అధికారం కోసం పార్టీ మారడం కాదంటూ చురక అంటించారు. నైతిక విలువలనేవి ఉంటే వైఎస్సార్సీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ పెట్టిన బిక్షతో ఎమ్మెల్సీ అయ్యావన్న విషయం గుర్తుంచుకోవాన్నారు. మూడేళ్లు పూర్తయి నాలుగో ఏట అడుగుపెడుతున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో కట్టిన వేల ఇళ్లు వైఎస్ఆర్ హయాం లోనివనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఐఎల్టీడీ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్, గామన్ బ్రిడ్జి కూడా వైఎస్ హయంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామంటూ శంకుస్థాపనలు చేసి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు దండగని ‘కాగ్’ అంక్షింతలు వేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. పట్టిసీమ ప్రయోజనంపై దమ్ముంటే ఎవరైనా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో చర్చకు సిద్ధమవ్వాలని సవాల్ విసిరారు. సమావేశంలో కార్పొరేటర్ బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు, పార్టీ నేతలు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, మాసా రామజోగ్, మజ్జి అప్పారావు, పెంకె సురేష్, కుక్కా తాతబ్బాయి, బాషా, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.