జగన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పడం సరికాదు
వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు
దానవాయిపేట(రాజమహేంద్రవరం) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నంద్యాల బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు వక్రభాష్యం చేబుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఇలాంటి దిగ్గజారుడు రాజకీయలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యపకాశరావు అన్నారు. శనివారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను తాకట్టు పెట్టి చంద్రబాబు వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మంత్రి పదవి ఆశ చూపారని, తీరా మంత్రి పదివి దక్కకపోవడంతో మానసికంగా కుంగి గుండె పోటుతో మరణించారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక రావడానికి చంద్రబాబే కారకుడని, ఈ ఉప ఎన్నిక దుర్మార్గాన్నికి, సన్మార్గాన్నికి జరగుతున్న ఒక పోరుగా ఆయన అభివర్ణించారు. 2009 శాసన సభ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామని వ్యాఖ్యనించారని, ఇది జరిగిన మరుసటి రోజు సెప్టెంబర్ 2న దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని దీన్ని పై టీడీపీ నేతలు ఏమి వివరణ ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయాల్లో అరోపణలు, ప్రత్య అరోపణలు సహజమని గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై వచ్చిన అరోపణలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వీకరించి సీబీఐ విచారణకు సిద్ధామని సవాల్ చేశారని ఇప్పుడు నారా లోకేష్ పై వస్తున్న ఆరోపణల పై బాబు నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా శాసన సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్ వీడియోను, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చంద్రబాబుపై చేసిన విమర్శల వీడియోలను మీడియాకు చూపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వసనీత ఉందని, ఇటువంటి విమర్శలకు పార్టీ భయపడ్డేది లేదని, దీన్ని పై నంద్యాల ప్రజలే సరైన తీర్పు చేబుతారని వెల్లడించారు .ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్లు తామాడ సుశీల, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలు కిరణ్ మోహన్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ, నగర మహిళ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, పెంకే సురేష్ తదితరులు పాల్గొన్నారు.