హజ్ కరపత్రాలు విడుదల
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : ఆస్తానే బుఖారియా పీఠంలో గురువారం హజ్ యాత్ర సూచనలు గల కరపత్రాలను పీఠాధిపతి ముస్తఫా హుసేని బుఖారి ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన నగర ప్రముఖులు ఏఎస్ సాహెబ్‌జాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరపత్రాల్లో పొందుపరిచామని వివరించారు.
పీఠాదిపతి ముస్తఫా హుసేని బుఖారి మాట్లాడుతూ హజ్ యాత్రచేయడంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ప్రార్థనా విధానాలు ఈ కరపత్రంలో ఉన్నాయని, వాటిని యాత్రికులు పాటించాలన్నారు. కరపత్రాలు ముస్లిం ఆర్ఫనైజ్లో ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మునీర్ హుస్సేన్, రాయల్ రషీద్, హుసేని ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.