మధ్యాహ్న భోజనానికి బదులు రూ.150
కేకేనగర్: ఎన్నికల పనులకు సంబంధించిన శిక్షణా తరగతులకు హాజరయ్యే సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి బదులుగా ఆహార భత్యం అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ర్టంలో మే 16న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఆ పనుల కోసం 1.97 లక్షల మంది మహిళలతో సహా 3.29 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు నియమించిబడ్డారు. ఈ సిబ్బందికి శిక్షణా తరగతులు ఆదివారం రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. వీరందరికి మూడు విడతలుగా శిక్షణ అందజేయనున్నారు. శిక్షణ కోసం వచ్చే ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం కోసం రూ.150 కేటాయిస్తున్నారు.
అయితే శిక్షణా శిబిరాలలో ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్న అధికారులు నాణ్యమైన ఆహారాన్ని అందజేయడం లేదని పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం సూచించే విధంగా శిక్షణకు వచ్చే వారి చేతికే రూ.150 ఇవ్వండి, శిక్షణ శిబిరాలు వద్ద ఏదైనా తాత్కాలిక హోటల్‌ను కానీ, స్టాల్స్‌ను కానీ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. శిక్షణా తరగతులకు హాజరయ్యే ఉద్యోగులకు ఇష్టమైన ఆహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.