పసిడి ధరలు మరింత తగ్గుముఖం!
ముంబై: బంగారం ధరల మరింత తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రుపాయి విలువ స్థిరంగా కొనసాగితే డిసెంబర్ నాటికి పది గ్రాముల బంగారం ధర 24,500 రూపాయలకు తగ్గవచ్చని భావిస్తున్నారు.
శనివారం మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 26,143 రూపాయలు పలికింది. బంగారం ధరలు ఒకటి లేదా రెండు వారాలు నిలకడగా ఉండవచ్చని, ఆ తర్వాత ధరలు తగ్గుతాయని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది చివరకు బంగారం ధర 1080-1120 డాలర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రుపాయి విలువ స్థిరంగా కొనసాగితే భారత్‌లోనూ బంగారం ధర తగ్గుతుందని చెప్పారు.