రూ. 29 లక్షల హవాల డబ్బు స్వాధీనం
హైదరాబాద్: బైక్ పై పెద్ద మొత్తంలో హవాల డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తరలిస్తున్న రూ. 29 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వారిని డబ్బుకు సంబంధించిన పత్రాలు అడగగా వారు తెల్లముఖాలు వేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. గురువారం రాత్రి కూడా నగరంలోని షాహినాయత్‌గంజ్ పోలీసులు రూ. 50 లక్షల విలువైన హవాల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.