జియో బంపర్ టారిఫ్లు ఇవే!!
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సర్వీసులపై యూజర్లకు ముకేశ్ అంబానీ బంపర్ టారిఫ్లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ టెలికాం పరిశ్రమ అందించలేని టారిఫ్లను వినియోగదారులు ముందుకు తీసుకొచ్చారు. ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాలింగ్, అపరిమిత మెసేజింగ్ సదుపాయం, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఎలాంటి ప్రత్యేక చార్జీలుండవని ప్రకటించిన ముకేశ్, విద్యార్థులకు స్టూడెంట్ ఐడీ కార్డుపై 25 శాతం అదనపు డేటాను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ లాంచ్ అనంతరం వెల్కమ్ ఆఫర్ కింద అందరికీ ఒక నెల ఉచిత సర్వీసులను అందించనున్నట్టు వరాల జల్లులు కురిపించారు. వచ్చే ఏడాది కల్లా కోటి వై-ఫై కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్న ముకేశ్, ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలపైనే ఎక్కువగా దృష్టిసారించారు.
టెలికా పరిశ్రమలో విప్లవం సృష్టించే జియో డేటా టారిఫ్లు....
1 ఎంబీ డేటా 5 పైసలు
1జీబీ డేటా 50 రూపాయలు
28 రోజులకు 300 ఎంబీ 4జీ డేటా టారిఫ్ రూ.149
రూ.499కు 4 జీబీ 4 జీ డేటాతో పాటు నైట్ అన్లిమిటెడ్ డేటా యూసేజ్
వై-ఫై హాట్స్పాట్లతో రిలయన్స్ జియోపై 8 జీబీ డేటాను పొందవచ్చు.
రూ.999లకు 10 జీబీ 4 జీ డేటా, 20 జీబీ వై-ఫై యూసేజ్, నైట్ అన్లిమిటెడ్ యూసేజ్
రూ.1,499లకు 20 జీబీ 4 జీ డేటా
రూ.2,499కు 35 జీబీ 4 జీ డేటా
రూ.3,999కు 60 జబీ 4 జీ డేటా
రూ.4,999కు 75 జీబీ 4జీ యూసేజ్, నైట్ అన్లిమిటెడ్, 150 జీబీ వై-ఫై డేటా