రూ. 50 లక్షల పాత నోట్లు స్వాధీనం
రాజమండ్రి: రాజమండ్రి రైల్వే స్టేషన్లో కస్టమ్స్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షల విలువైన వెయ్యి రూపాయల నోట్లు కలిగి ఉన్న వ్యక్తిని కస్టమ్స్, జీఆర్పీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి బొకారో ఎక్స్ప్రెస్లో శనివారం గోదావరి స్టేషన్కు సదరు వ్యక్తి వచ్చాడు. తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు అతని వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన పాత వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.