'కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు'
హైదరాబాద్: నగరంలో ఉన్న ఆస్పత్రులకు రూ.552 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.... ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని రాజయ్య తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకుంటున్న చర్యలు వివరించాలని అసెంబ్లీలో సభ్యుడు ప్రశ్నకు టి.రాజయ్య పైవిధంగా సమాధానమిచ్చారు.