Rs 6 lakh
-
ఎక్స్గ్రేషియా రూ.6 లక్షలకు పెంపు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ బీమా పథకం కింద ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కేంద్ర ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ట్రస్టీల సమావేశం అనంతరం దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. డిపాజిట్ లింక్డ్ బీమా పథకం ద్వారా ప్రస్తుతం కార్మికుల కుటుంబాలకు రూ.3.60 లక్షలు మాత్రమే అందుతోందని పేర్కొన్నారు. దీనివల్ల 4 కోట్ల మంది భవిష్యత్నిధి చందాదారులకు(ఈపీఎఫ్) లబ్ధి చేకూరుతుందన్నారు. సంవత్సరంపాటు తప్పనిసరిగా ఉద్యోగం చేసుండాలన్న నిబంధనను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పారదర్శకతతో ఉద్యోగుల భవిష్యనిధి కార్యకలాపాలను నిర్వహించడానికి మొబైల్ అప్లికేషన్ రూపొందించామన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ విశిష్ట ఖాతానంబర్, భవన నిర్మాణ కార్మికులందరికీ ఈపిఎఫ్ వర్తింపచేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమనిధి వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించని రాష్ట్రాల కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేయడంతోపాటు, ఆయా రాష్ట్రాల నిధులను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ తెలిపారు. -
ఇక 6 లక్షల ఆదాయం ఉంటేనే కార్ లోన్
న్యూఢిల్లీ: వార్షిక ఆదాయం ఆరు లక్షల రూపాయలకన్నా తక్కువవుండే వారు ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి కారు రుణాన్ని పొందలేరు. ఈ మేరకు కారు రుణాల మంజూరీ అర్హత నిబంధనలను బ్యాంక్ కఠినతరం చేసింది. వేతనజీవులకు ఇప్పటివరకూ రూ.2.5 లక్షలుగా ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకు పెంచింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంక్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిఫాల్ట్ అవకాశాలను తగ్గించుకునే ఉద్దేశంతో ఇందుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రుణం కోసం ప్రత్యేకంగా తెరిచే అకౌంట్ విషయంలో వార్షిక ఆదాయ పరిమితి రూ.6 లక్షలయితే, అప్పటికే ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయితే వార్షిక ఆదాయ పరిమితి రూ.4.5 లక్షలు. 10.45 శాతం వడ్డీరేటుకు ఎస్బీఐ ప్రస్తుతం కారు రుణాలను ఆఫర్ చేస్తోందని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. క్లిష్ట ఆర్థిక పరిస్థితులే కారణం... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ‘ఎగవేతల’ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. బ్యాంక్ ఆటో రుణ పోర్ట్ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసే నాటికి 2012-13 ఇదే కాలంతో పోల్చితే 38.71 శాతం పెరిగి రూ.26,411 కోట్లుగా ఉంది. బ్యాంక్ మార్కెట్ వాటా ఈ విషయంలో 2.44 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగింది. కాగా స్థూల మొండి బకాయిల (ఎన్పీఏ) పరిమాణం ఇదే కాలంతో 4.99 శాతం నుంచి 5.56 శాతానికి చేరింది. ఇక నికర మొండి బకాయిల పరిమాణం 2.22 శాతం నుంచి 2.83 శాతానికి ఎగసింది.