15 నిమిషాల్లో 7 లక్షల కోట్లు డమాల్!
ముంబై: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రేపుతున్న ఉత్కంఠతో దేశీయ స్టాక్ మార్కెట్లు మహాపతనాన్ని నమోదు చేశాయి. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి ముందంజ వేయడంతో విశ్లేషకులు అంచనాలకనుగుణంగానే ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సునామీ చెలరేగింది. బ్రెగ్జిట్ ను మించిన ఆందోళన మదుపర్లను పట్టి కుదిపేసింది.
దలాల్ స్ట్రీట్ లో వెడ్నెస్ డే బ్లడ్ బాత్ గా నిపుణులు విశ్లేషించారు. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా ఉదంతం సందర్భంగా కూడా ఇంతలా మార్కెట్ పతనం కాలేదని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 500 పాయింట్ల నష్టంతో రికార్డు స్థాయి పతనాన్ని నమోదుచేసింది.
అమెరికా 45వ ప్రెసిడెంట్ గా ఎవరు నెగ్గనున్నారన్న ఉత్కంఠతో మార్కెట్ లో కేవలం 15 నిమిషాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఈ అనూహ్యపరిణామాలుతో డాలర్ ఢమాల్ అంది. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి 23 పైసల నఫ్టంతో 66.83 వద్ద ఉంది. పసిడి మాత్రం ఒకరేంజ్ లో దూసుకుపోతోది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 1294లకు పైగా ఎగిసిన పుత్తడి రూ. 31,174 వద్ద ఉంది.