రూ. 8.45 లక్షల కోట్ల డిపాజిట్లు
ముంబై: పెద్ద నోట్ల రద్దుతర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వెల్లువ కొనసాగుతోంది. నవంబరు 27 నాటికి మొత్తం రూ.8.45 లక్షల కోట్ల డిపాజిట్ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. డిపాజిట్ల విలువ రూ. 8,44,982 కోట్లకు చేరిందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ఆర్థిక వ్యవస్థనుంచి 86శాతం వాటావున్న పె ద్ద నోట్ల రద్దు తరువాత రూ 33.948 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి జరిగింది. రూ.14 లక్షల కోట్ల విలువైన రూ..500 నుంచి రూ .1,000 నోట్ల ఉపసంహరణ తరువాత వివిధ బ్యాంకులకు అందించిన డిపాజిట్లురూ. 8,11,033తో కలిపి తిరిగి వచ్చిన డబ్బు మొత్తం రూ 8,44,982 కోట్లకు చేరింది. నవంబరు 8 తరువాత నవంబరు 10 - 27తేదీల్లో బ్యాంకుల ద్వారా గానీ, ఏటీఎం ల ద్వారా ప్రజలు విత్ డ్రా చేసిన మొత్తం రూ. 2,16,617 లుగా ఆర్బీఐ వెల్లడించింది.