రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సహకరించడం లేదు
మంత్రి ఈటల రాజేందర్
డిచ్పల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేల నగదు ఇవ్వడం ఇబ్బందిగా మారిం దని, రాష్ట్ర ప్రభుత్వా నికి ఆర్బీఐ తగిన సహకారం అందించక పోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు తలె త్తుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నిజామా బాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. కేంద్రం రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పటి వరకు బ్యాంకుల్లో సుమారు రూ.95వేల కోట్లు డిపాజిట్లు అయినట్లు తెలిపారు. వీటిలో సుమారు రూ.75వేల కోట్లు రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నా యని తెలిపారు. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొత్త కరెన్సీలో రూ.2వేల నోట్లు అధికంగా ఉన్నాయని ఈటల వివరించారు. దీంతో చిల్లర సమస్యతో చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు తీవ్ర పడుతున్నారని మంత్రి తెలిపారు.