సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 96.85 లక్షలు
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : అన్నవరం సత్యదేవునికి హుండీల ద్వారా 28 రోజులకు రూ.96,85,428 ఆదాయం వచ్చింది. హుండీలను గురువారం లెక్కించగా నగదు రూ.91,43,247, చిల్లర నాణాలు రూ.5,42,181, బంగారం 180 గ్రాములు, వెండి 640 గ్రాములు వచ్చినట్టు దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తెలిపారు.
అమెరికన్ డాలర్లు 238, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 140, కువైట్ దీనార్ 0.25, సింగపూర్ డాలర్లు 37, కెనడా డాలర్లు 20, ఒమెన్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ 300, మలేషియా రిమ్స్ రెండు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పౌండ్స్ 15, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియూల్స్ రెండు లభించాయని తెలిపారు.
ఆలయంలోని ప్రధాన హుండీలను గోదావరి పుష్కరాలకు ముందు జూలై 8న మరోసారి లెక్కిస్తామన్నారు. హుండీల లెక్కింపులో విశాఖపట్నానికి చెందిన 65 మంది శ్రీహరిసేవ సభ్యులతోపాటు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.