రమ్య కుటుంబానికి రూ.12 లక్షల చెక్కు అందజేత
భీమారం : హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమ్య కుటుంబానికి రూ.12 లక్షల చెక్కును స్పీకర్ మధుసూదనాచారి బుధవారం అందజేశారు. ప్రమాదంలో మృతి చెందిన రమ్య కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నగరంలోని విజయగణపతి కాలనీలోని వారి ఇంటికి వెళ్లి రమ్య తండ్రి రమణ, బాబాయి రమేష్‌కు చెక్కు అందించారు. స్పీకర్ వెంట వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుడిమళ్ల రవికుమార్, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.