రూ.1.50 లక్షల విలువైన కలప పట్టివేత
ములుగు : అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన టేకు కలపను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మల్లేశ్‌యాదవ్ ఉదయం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జంగాలపల్లి వైపు నుంచి వస్తున్న బొలోరో వాహనం ఆనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 19 టేకు దుంగలు ఉన్నాయి. దీంతో వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. అందులో ఉన్న నర్సంపేటకు చెందిన దారుగుల సూర్యనారాయణ, గాదె రాజేశ్, మండలంలోని మదనపల్లికి చెందిన జాటోతు ధరమ్సింగ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు. పెట్రోలింగ్‌లో కానిస్టేబుళ్లు సునిల్, శ్రీనివాస్, వాసు పాల్గొన్నారు.