కనీస వేతనం రూ.16 వేలు ఇవ్వాలి
అనంతపురం టౌన్ : గ్రామీణాభివద్ధి శాఖ పరిధిలోని ‘వెలుగు’లో పని చేస్తున్న ఎల్–1, ఎల్–2 ఉద్యోగులకు కనీస వేతనం రూ.16 వేలు ఇవ్వాలని వెలుగు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అశ్వర్థరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం టీటీడీసీలో జరిగిన ఎల్–1, ఎల్–2, ఎంఎస్ సీసీల యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఎస్ సీసీలకు రూ.12 వేలు వర్తింపజేయాలన్నారు. ఎఫ్టీఏలకు రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 43 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలన్నారు. అనంతరం ఈ సమస్యలపై సెర్ప్ సీఈఓకు వినతిపత్రం అందజేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో వెలుగు క్షేత్రస్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు.