వడ్డికాసుల వాడి ఆదాయం రూ.1.60 కోట్లు
దేవరపల్లి (ద్వారకా తిరుమల) : ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. 20 రోజులకు నగదు రూపంలో రూ.1,59,80,346 ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ సైతం భారీగా రావడం విశేషం. కానుకల రూపంలో 627 గ్రాముల బంగారం, 7.728 కేజీల వెండిని భక్తులు సమర్పించుకున్నారు. నగదు రూపంలో రోజుకు సగటున 7.99 లక్షల ఆదాయం లభించినట్టు ఈవో వి.త్రినాథరావు చెప్పారు. హుండీల ఆదాయాన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సోమవారం లెక్కించారు.