మల్లన్న ఆదాయం రూ.1.72 కోట్లు
శ్రీశైలం (కర్నూలు) : శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ. 1,72,79,814 కోట్లు వచ్చినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. నగదుతో పాటు 195 గ్రాముల బంగారు, 4, 200 గ్రాముల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ 189 అమెరికా డాలర్లు, 100 సింగపూర్ డాలర్లు, 32 మలేషియా రింగిట్స్, 20 బ్రిటిష్ పౌండ్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 ఖతార్ రియాల్స్ లభించాయన్నారు. ఈ మొత్తం స్వామి అమ్మవార్లకు 30 రోజులకు వచ్చిన ఆదాయంగా ఈవో పేర్కొన్నారు.