Rs.1Crore
-
జీహెచ్ఎంసీలో భారీ స్కాం
-
జీహెచ్ఎంసీలో భారీ స్కాం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ నాలాల్లో మురుగు మాదిరిగా కాంట్రాక్టర్లలోఅవినీతి పెరిగిపోయింది. చేయని పనులకు నకిలీ బిల్లులతో కోట్లల్లో దిగమింగుతున్నారు. తాజాగా నాలాల్లో పూడికతీత పేరుతో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది. మురుగుకాల్వల్లో తొలగించిన పూడికను టూ వీలర్స్..4 వీలర్స్ లో తరలించినట్టు కాంట్రాక్టర్లు కోటి పద్దెనిమిది లక్షల రూపాయల మేర నకిలీ బిల్లులు సృష్టించారు. అనుమానం వచ్చిన అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో జీహెచ్ఎంసీ ఏఈల హస్తం ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సంబంధం ఉన్న 12మంది ఏఈలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
సిద్దవటం: వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం మట్టిపల్లి గ్రామ సమీప అడవిలోరూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున జరిగింది. వివరాలు...ఏ, బీ గ్రేడ్‌కు చెందిన రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను లారీలో తరలించేందుకు సిద్ధం చేస్తుండగా ముందస్తు సమాచారంతో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంలో స్మగ్లర్లు, కూలీలు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఎర్రచందనం దుంగలను, లారీని కడప అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ అధికారులు చెప్పారు.