చెరకుకు రూ. 2,900 మద్దతు ధర
చెల్లూరు సుగర్స్ జీఎం వెల్లడి
చెల్లూరు (రాయవరం):
మండలంలోని చెల్లూరు సర్వారాయ చక్కెర కర్మాగారం చెరకు సరఫరా చేసే రైతులకు మద్దతు ధరను ప్రకటించింది. ఈ విషయాన్ని సర్వారాయ చక్కెర కర్మాగారం జనరల్ మేనేజర్ జి.కోటేశ్వరరావు గురువారం విలేకరులకు తెలిపారు. 2016–17 సీజ¯ŒSకు కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధర టన్నుకు రూ.2,300 ప్రకటించిందన్నారు. అయితే రైతుల సంక్షేమాన్ని, వారి అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు పన్నుతో కలిపి టన్నుకు రూ.2,900 ఇవ్వనున్నట్టు తెలిపారు. 2016–17 సీజ¯ŒSకుగాను 2017 జనవరి 15వ తేదీ వరకు టన్నుకు రూ.2,825 వంతున కొనుగోలు చేస్తామని, 2017 జనవరి 16 నుంచి పరిశ్రమకు చెరకు సరఫరా చేసే రైతులకు కొనుగోలు పన్నుతో కలిపి టన్ను ఒక్కింటికి రూ.2,900 వంతున చెల్లించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. చెరకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా చార్జీలకు పరిశ్రమ ప్రకటించిన రాయితీ దీనికి అదనంగా చెల్లిస్తామని తెలిపారు. 2016–17 సీజ¯ŒSకు చెరకు నాటే రైతులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒక ఎకరానికి 4టన్నుల విత్తనం లేదంటే రూ.10వేల నారు మొక్కలు ఉచితంగా ఇస్తామన్నారు. రసాయనిక ఎరువులు వడ్డీలేని రుణం కింద ఇస్తామన్నారు. జీవన ఎరువులు ఎకరానికి ఆరు బస్తాలు వడ్డీలేని రుణం కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. చెరకు తోటలో వచ్చే కీటకాలు, తెగుళ్ల నివారణకు క్రిమి సంహారక మందులను కొంత సబ్సిడీ మీద మిగిలిన మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇస్తామన్నారు. పరిశ్రమ పరిధిలోని రైతులు ఫ్యాక్టరీ ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు ఉపయోగించుకుని చెరకు సాగును విరివిగా చేపట్టాలని కోరారు.