40 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రేలుగుంట సమీపంలో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా చేస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబందించిన ఒక ఆటోను సీజ్ చేశారు.
గంజాయి తరలిస్తున్నఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(రేలుగుంట)