స్కూటర్ డిక్కీ నుంచి రూ.8.80 లక్షలు మాయం
హైదరాబాద్: స్కూటర్ డిక్కీలో ఉంచిన రూ.8.80 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
సుబ్బారావు అనే డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వర కాలనీలోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ముందు స్కూటర్ నిలిపి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి డిక్కీ పగులగొట్టి ఉంది. అందులో ఉంచిన రూ.8.80 లక్షలు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.