పరువునష్టం కేసులో రాహుల్కు బెయిల్
ముంబయి: పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు అయింది. ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసులో ఆయన బుధవారం ముంబయిలోని బివండి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు.. ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ... తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 28కి వాయిదా వేసింది.
కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ 2014 మార్చి 6న బీవండిలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మహాత్మా గాంధీ ని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆర్ఎస్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన నిన్న సాయంత్రమే ముంబయి వచ్చారు.
బెయిల్ మంజూరు అనంతరం రాహుల్ గాంధీ....పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. సామాన్యులు తప్ప, ధనికులు ఎవరూ క్యూలో నిలబడి నగదు తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.