నల్లగొండలో రుద్రమదేవి విగ్రహావిష్కరణ
నకిరేకల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లాలో రుద్రమదేవి విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించనున్నారు. నకిరేకల్ మండలం చందుపట్లలో కాకతీయ సామ్రాజ్య విశేషాలకు సంబంధించిన శాసనాలు లభ్యం కావడంతో అక్కడ రుద్రమదేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొంటారు.