Rule of law
-
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ను నిందించారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని ట్రూడో ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని అమెరికా, మిత్రదేశాలను కోరారు. రూల్ ఆఫ్ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఈ వివాదం ఇరుదేశాల మధ్య అగ్గి రాజేసింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వేదికలపై ట్రూడో ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్‌ను నిందించారు. దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
రూల్ ఆఫ్ లా : నాడు–నేడు
ఎందుకో తెలియదు. ఆనాటి కాలమహిమ ఏమిటో సామా న్యులకు అర్థం కాదు. సాక్షాత్తూ ఒక శాసనసభ్యుడు ఒక మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చేసిన రోజున, దుశ్శాసన పర్వాన్ని బహిరంగంగా పునఃప్రదర్శించిననాడు ఎందుకనో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు బ్రేక్‌డౌన్ అయినట్టు ఎవరికీ అనిపించ లేదు. రవాణా శాఖలో అత్యున్నత పదవిలో పనిచేస్తున్న ఒక సీని యర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని నడివీధిలో నిలబెట్టి ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే వారి అనుచరగణం చూపుడు వేళ్లతో బెదిరిస్తూ, బూతులు తిట్టిన రోజున కూడా ఎందుకనో పెద్దలెవరూ రాజ్యాంగ వ్యవస్థల భవిష్యత్తుపై బెంగపడలేదు.రిషితేశ్వరి అనే చదువుల తల్లిని, తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న గారాల పట్టిని కామాంధులు చిదిమేస్తే, కంచే చేను మేసిన చందంగా ఆ కళాశాల ప్రిన్సిపల్‌పైనే ఆరో పణలు వస్తే, ప్రభుత్వ పెద్దల అండతో ఆ ప్రిన్సిపల్ నిక్షేపంగా తిరుగాడుతుంటే ఎందుకనో రూల్ ఆఫ్ లా ఏమైందని పూజ్యు లెవరూ ప్రశ్నించనే లేదు. పాలక పార్టీ అనుయాయులు ఇసుకాసురుల అవతారం దాల్చి వాగులూ వంకల మూల్గలు పేల్చేస్తున్న వేళ, ఈ దుర్నీ తిని ఆపేయాలని కోరుతూ ధర్నాకు దిగిన ఏర్పేడు గ్రామస్తు లను లారీలతో తొక్కించి, ఇరవైమంది ప్రాణాలను హరించి రహదారిపై వారి నెత్తురును బలి చల్లినప్పుడు ఎందుకనో ఇందులో కుట్ర కోణం తోచనేలేదు. రేషన్ కార్డుకు లంచం, నీ కులమేదో చెప్పడానికి లంచం, నీ రాబడి ఎంతో చెప్పే కాగితానికి లంచం, ఇంట్లో బిడ్డ పుట్టిన తేదీని నిర్ధారించే పత్రానికి లంచం. పెద్దమనిషి చనిపోయాడన్న ధ్రువీకరణ పత్రానికి లంచం. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే లంచం, పింఛన్ ఇప్పిస్తే లంచం. అధికార వర్గానికి ఒక రేటు, పాలక పార్టీ వారి జన్మభూమి కమిటీకి మరొక రేటు. పౌరులు ఉచి తంగా పొందవలసిన సేవలకు ‘డబుల్ ట్యాక్స్’ చెల్లించిన అన్యాయపు రోజులలో ఇదేమి రాజ్యమనీ, దోపిడీ రాజ్యం కాదా అని ఎవరూ ప్రశ్నించనే లేదెందుకనో. ప్రభుత్వ పెద్దలే పూనుకుని, బుల్డోజర్లు పెట్టి బాజప్తా బెజవాడ వీధుల్లో 40 దేవాలయాలను కూల్చివేసిన రోజున ఎవరి మతవిశ్వాసాలూ దెబ్బతిననే లేదు. స్వయంగా ముఖ్య మంత్రే మీడియా సమావేశంలో ‘దళితులుగా పుట్టాలని ఎవ రైనా కోరుకుంటారా?’ అని ఈసడించుకుంటే అందులో కుల దురహంకారం గోచరించలేదెందుకో తెలియదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రభుత్వ డబ్బును పసుపు కుంకుమ పేరుతో ఓట్ల కొనుగోలుకు బరితెగించి ఉపయోగిస్తే, ఇంటికి పదివేల చొప్పున బ్యాంకు ఖాతాల్లోకే బట్వాడా చేస్తే సమన్యాయ పాలన సమ్మగానే ఉన్నట్లు వ్యవస్థలు అనుభూతి పొందిన కారణమేమిటో ఎంతకూ అర్థం కాదు. నాటి ఐదేళ్ల పాలనలో అమలైన రూల్ ఆఫ్ లా విశేషాలను ఇలా చెప్పు కుంటూ పోతే కొండవీటి చాంతాడును పేనవలసి ఉంటుంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉన్నదా లేదా?’ అని వ్యాఖ్యానించి నట్టు మీడియా రిపోర్టు చేసింది. అంటే రాష్ట్రంలో చట్టబద్ధమైన పరిపాలన అందుతున్నదా... లేదా? సమన్యాయం అందుతు న్నాదా.. లేదా అని ఉన్నత న్యాయస్థానం సందేహపడినట్టు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల బ్రేక్‌డౌన్ జరిగిందా లేదా అన్న విషయాన్ని కూడా తేల్చేస్తామని న్యాయస్థానం హెచ్చరించినట్టు రిపోర్టయ్యింది. దసరా కంటే ముందుగానే పులివేషం వేసే అవకాశాన్ని ఎల్లో మీడియాకు ఈ వార్తా కథనాలు కల్పించాయి. భూమి బద్దలై నంత ప్రాధాన్యతనిచ్చి ఎల్లో మీడియా రిపోర్టు చేసింది. అదే రోజు రాష్ట్రానికే సంబంధించిన మరో అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కేసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని రాష్ట్ర హైకోర్టుకు సూచనలు చేసింది. ఈ వార్తను మాత్రం ఎల్లో మీడియా ‘దాగుడుమూతలు దండాకోర్, పిల్లీ వచ్చే ఎలుకా భద్రం’ అన్నట్టుగా దాచేసింది. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల అక్రమ బద లాయింపులపై అప్పటి తుళ్లూరు తాసిల్దారు సుధీర్‌బాబు మీద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని కొట్టేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఆయన కోరిన విధంగా హైకోర్టు ఆదేశాలి చ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దర్యాప్తు స్టే ఇవ్వడాన్ని ప్రాథమికంగా తప్పుపడుతూ కేసును వారంలోగా తేల్చాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. విజయవా డలో రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం వ్యవహారంలోనూ ఈవి ధమైన పరిణామాలే సంభవించాయి. దర్యాప్తుకు సహకరించ కుండా పారిపోయిన ఆస్పత్రి చైర్మన్ రమేశ్‌బాబు తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయిం చారు. రమేశ్‌పై తదుపరి చర్యలను హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సరైన విధానం కాదని సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా అమరావతి భూముల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై, ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. మరుసటిరోజు ఏసీబీ దమ్మాల పాటితోపాటు సుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తి ఇద్దరు కూతుళ్లు సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్పై కూడా స్టే విధిస్తూ నిందితులెవ్వరినీ అరెస్ట్ చేయ వద్దనీ, కేసు వివరాలు కూడా మీడియాలో రావద్దని హైకోర్టు ‘గ్యాగ్’ ఆర్డర్ వేసింది. రాజకీయ నాయకులపై దాఖలైన అవి నీతి కేసుల విచారణలో జాప్యం జరగరాదని, సత్వరమే పూర్తి చేయాలనీ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కింది కోర్టులను ఆదేశించిన సమయంలోనే, అవినీతి కేసులపై మన హైకోర్టులో స్టేలు మంజూరు కావడం ఆసక్తికరంగా మారింది. న్యాయవ్యవస్థ మీద, కొందరు న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టింగ్‌ల విచారణ సందర్భంగా హైకోర్టు తన ఆగ్రహాన్ని ప్రకటించింది. ఈ విష యంలో పోలీసులు, సీఐడీ జరుపుతున్న విచారణ తీరుతెన్ను లను పరిశీలిస్తామని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. నిజమే, ఎటువంటి నియంత్రణ లేకుండా సోషల్ మీడియాలో సాగుతున్న వ్యక్తిత్వహనన రాతలను తీవ్రంగా గర్హించవలసినదే, అరికట్టవలసినదే. గౌరవ న్యాయమూర్తులే కాకుండా సమా జంలో సెలబ్రిటీలుగా చలామణిలో ఉన్న రాజకీయ ప్రము ఖులు, కళాకారులు ముఖ్యంగా మహిళలు సోషల్ మీడియా వెకిలిరాతల బాధితులే. ఇందులో భిన్నాభిప్రాయానికి తావు లేదు. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేవలం సోషల్ మీడియా అనే ఒక అంశాన్ని తీసుకొని మొత్తం వ్యవస్థకు ఆపాదించే ప్రయత్నం చేయడం సరికాదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉన్నట్లయితే వాటిని తీర్పులో అంతర్భాగం చేయాలని కూడా కోరింది. రాజకీయ స్పందనలే కాకుండా, న్యాయస్థానం చేసిన ‘రూల్ ఆఫ్ లా ఉన్నదా లేదా?’, రాజ్యాంగ వ్యవస్థలు బ్రేక్‌డౌన్ అయ్యాయా?’ తదితర వ్యాఖ్యలు ప్రజల్లో కూడా చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ఈ అంశాలపై చంద్రబాబు పరిపాలనా కాలాన్ని, నేటి పరిస్థితులను పోల్చి చూసుకుంటున్నారు. విపక్షాల విమర్శల పరదాలను, మీడియా కప్పేసిన పచ్చ ముసుగును తొలగించి చూస్తే ఆంధ్రప్రదేశ్ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించగలుగుతాము. అప్పుడు మాత్రమే అక్కడ రూల్ ఆఫ్ లా ఎలా వుందో తెలుస్తుంది. సమ న్యాయ పాలన ఏవిధంగా అమలవుతున్నదో చూడవచ్చు. సామాజిక న్యాయం తీరుతెన్నులు చూడవచ్చు. శిథిలమైన సర్కారు బడుల్లో చిగురిస్తున్న వసంతాన్ని చూడవచ్చు. ధర్మాసు పత్రులు ఆధునిక హంగులు తొడుక్కుని జనానికి చేరువవుతున్న దృశ్యాన్ని గమనించవచ్చు. గడపగడపనూ తాకిన సర్కారు సంక్షేమాన్ని చూడవచ్చు. ఊరూరా ఎగరేసిన గ్రామ స్వరాజ్యపు గాంధేయ పతాకానికి సెల్యూట్ చేయవచ్చు. అన్నిటినీ మించి పల్లెటూళ్ల నుంచి లంచావతారం పారిపోతున్న అద్భుత దృశ్యాన్ని గమనించవచ్చు. అప్పటి పాలనకూ ఇప్పటి పాల నకూ తేడా ఏం చెబుతావని డెబ్బయ్యేళ్ల వయోధికుడు నాగ న్నను ప్రశ్నించినప్పుడు ‘లంచాలు అవసరం లేని పరిపాలన ఇప్పుడు చూడగలుగుతున్నానని చెప్పాడు. నాగన్నది ఎల్లుట్ల గ్రామం. పుట్లూరు మండలం. అనంతపురం జిల్లా. ఇంతకు ముందు పుట్టినా, చచ్చినా కాగితం కావాలంటే వెయ్యి రూపా యలు ముట్టజెప్పి ఎదురు చూడవలసి వచ్చేది. ఇప్పుడు గ్రామ సచివాలయంలో అర్జీ పడేస్తే పనైపోతున్నదన్నాడు. గతంలో రేషన్ కార్డు, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, అడంగల్‌లో పేరు నమోదు, పాస్ పుస్తకం వంటి చిన్నచిన్న పనులకోసం సగటున ప్రతి గ్రామంలోని ప్రజలు హీనపక్షం పది లక్షల రూపాయలను యేటా సమర్పించుకోవాల్సి వచ్చేదని తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామ ఉపాధ్యాయుడు అంచనా వేసి చెప్పాడు. ఇప్పుడు ఆ పది లక్షలు గ్రామ ప్రజల జేబుల్లో భద్రంగా ఉంటున్నాయని చెప్పాడు. ఏ గ్రామంలో ఏ వ్యక్తిని పలకరించి అడిగినా సరే సంక్షేమ పథకాల అమలులో ‘కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అర్హుడయితే చాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన బాస నూటికి నూరుపాళ్లు అమలవుతున్నదని చెబుతాడు. ఇంతకంటే సమ న్యాయపాలన ఏముంటుంది? జస్ట్ ఆరోపణ వస్తేనే అధికార పార్టీ ఎమ్మెల్యేను సైతం అరెస్ట్ చేసి విచారించిన ప్రభుత్వం ఇది. రూల్ ఆఫ్ లా అమలుకు ఈ ఒక్క ఉదాహరణ చాలదా అని విజయవాడలోని ఒక న్యాయవాది ప్రశ్నించారు. విద్యకూ వైద్యా నికి దూరమై, వ్యవసాయం నిర్లక్ష్యానికి లోనై, చిన్నచిన్న పనుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ, ఎమ్మార్వోల చుట్టూ తిరిగే జనంతో నిస్తేజంగా మారిన గ్రామసీమల్లో ఇప్పుడు కొత్త గాలులు వీస్తు న్నాయి. బాపుగారి ముత్యాల ముగ్గు సినిమాలో గుంటూరు శేషేంద్ర శర్మ పాటలాగా. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. కన్నుల్లో నీరు తుడిచీ కమ్మని కల ఇచ్చింది.’ - వర్ధెల్లి మురళి -
ఎన్నికల చట్టాలు ఇవే.. ఉల్లంఘిస్తే శిక్షే
సాక్షి, సిటీబ్యూరో : లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యం దేశంలోని చట్టాల గురించి అవగాహన అవసరం. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే కీలకం. ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ పని చేస్తోంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సెక్షన్లు ఉన్పప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఆ చట్టాలేమిటో.. శిక్షలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం. ఆర్పీ యాక్ట్ 123 : లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంపొందిస్తే శిక్షకు అర్హులు. ఆర్పీ యాక్ట్ 125 : ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయవచ్చు. ఆర్పీ యాక్ట్ 126 : ఎన్నిక సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులవుతారు. అందుకు రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఆర్పీ యాక్ట్ 127 : ఎన్నికల సమావేశంలో అల్లర్లు చేస్తే యూఎస్ 42 సీఆర్పీసీ ప్రకారం వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 2 వేలు జరిమానా లేదా రెండూ విధింవచ్చు. ఆర్పీ యాక్ట్ 127 అ: ఎవరైనా తన పేరు చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 128 : బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 130 : పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ప్రచారం చేస్తే రూ. 250 జరిమానా విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 131 : పోలింగ్ బూత్‌కు సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సామగ్రిని స్వాధీనపరచుకుంటారు. మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 132 : ఓటేసే సమయంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 133 : ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూరిస్తే శిక్షార్హులు. మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 134 : ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. రూ. 500 వరకు జరిమానా ఉంటుంది. ఆర్పీ యాక్ట్ 134 అ : ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఏజెంట్‌గా వ్యవహరిస్తే శిక్షార్హులు. మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 : బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 500జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 135 అ: ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పోలింగ్ బూత్ స్వాధీనం పరచుకుంటే ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 ఆ : ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవు మంజూరు చేస్తే రూ.5 వేలు వరకు జరిమానా విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 ఇ : పోలింగ్ ఓట్ల లెక్కింపు రోజు మద్యం అమ్మకం, పంపిణీ నేరం. ఆరు నెలలు జైలు రూ. 2 వేలు జరిమానా విధిస్తారు. -
కొందరు జడ్జిలెందుకవుతారు?
విశ్లేషణ మన గొప్ప దేశంలో ఎవరిని జడ్జీలుగా ఎవరు ప్రతిపాదిస్తారో, ఎందుకు ప్రతిపాదిస్తారో, చివరకు కొందరి పేర్లు ఎందుకు రాలిపోతాయో, కొందరి భాగ్యవంతుల పేర్లు ఎందుకు రాలిపోవో బ్రహ్మకు కూడా అంతుబట్టదు. ఆర్టీఐలో తేలని అద్భుతమైన ప్రశ్నఇది. అంతుపట్టని సమస్య ఏమంటే న్యాయస్థానంలో న్యాయమూర్తులే తప్పు చేస్తే ఏం చేయాలని? మహాభిశంసన తప్ప మరో మార్గం లేదు. అనుచితంగా ప్రవర్తిం చారనే ఫిర్యాదు అంది, విచారణ జరిగి, సాక్ష్యాలు దొరికి రుజు వైనా తొలగింపు కష్టమే. మహాభిశంసన తీర్మానం ఆర్టికల్ 124(4) కింద ఆమోదిస్తేనే తొలగిస్తారు. తమ అహాన్ని దెబ్బతీసే తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై మహాప్రభువులు కోపించి పీకేయడానికి వీల్లేకుండా ఈ నియమాలు నియంత్రణలు. నిజానికి పాలకులకు న్యాయమూర్తులకు కూడా జవాబుదారీ తనం ఉండాలి. మేం గద్దెనెక్కాం కనుక ఏమైనా చేస్తాం అనే విధానానికి సంవిధానంలో స్థానం లేదు. సమపాలన, న్యాయవ్యవస్థమీద విశ్వాసం, సంస్థాగత బాధ్యత ఉండాలంటే ఏంచేయాలి. సైకిల్ దొంగను మూడు సంవత్సరాలు జైల్లో పెట్టిపోషిస్తాం కానీ న్యాయస్థానం సోఫా కొనుగోలులో వేల రూపాయలు భోంచేసిన న్యాయమూర్తిని యువర్ ఆనర్, మై లార్డ్ షిప్ అని సగౌరవంగా సత్కరిస్తామంటే దాన్ని రూల్ ఆఫ్ లా అని మాత్రం అనరు. ఆ పెద్దలకు ఒక్కోసారి లా తెలియకపోయినా ఫరవాలేదు. తినగ తినగ వేము తీయనైనట్టు కాలప్రవాహంలో అన్నీ సర్దుకుంటాయి. అంత పెద్ద వారు తప్పులు, పొరబాట్లు, అనుచిత ప్రవర్తన, దుర్మార్గం, లంచగొండితనం, కొనుగోళ్లలో వేళ్లు గోళ్లు పెట్టడం వంటి పాపాలకు పాల్పడరని, న్యాయవితరణ దైవికమైన సత్కార్యం అని, అందులో ఉన్న వారు దైవాంశ సంభూతులని జనం పెంచుకున్న నమ్మకాన్ని ఒక తులమెత్తయినా నిలబెట్టే బాధ్యత మన వ్యవస్థలో కనిపించాలన్నతపనే జవాబుదారీతనం గురించిన చర్చ. పాలకుల దుర్మార్గాలను కడిగేసే న్యాయవ్యవస్థే లేకపోతే మన జనుల అవస్థలు దారుణంగా ఉండవూ? తప్పులు రుజువైన తరువాత కూడా న్యాయమూర్తులు కె వీరాస్వామి, పీడీ దినకరన్, సౌమిత్రసేన్ విషయంలో మన సంవిధానం అస్త్రసన్యాసం చేసింది. మహా లేదూ, అభిశంసన అంతకన్నా లేదు. న్యాయపాలనలో నిర్లక్ష్యం చేస్తే నష్టపోయిన కక్షిదారుడికి నష్టపరిహారం ఇప్పించే నియమాలు రోమన్ చట్టాల్లో ఉన్నాయి. స్వీడన్లో చిన్న చిన్న శిక్షలు కూడా ఈ న్యాయపెద్దలమీద విధించే వీలుంది. డెన్మార్క్‌లో అయితే వారిమీద ఫిర్యాదులు వినడానికి ఏకంగా ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు మరి. మనకూ జడ్జీల విచారణ చట్టం 1968 ఉంది. జడ్జీ గారిమీద ఫిర్యాదును స్వీకరించాలంటే వంద లోక్‌సభ లేదా 50 రాజ్యసభ సభ్యులు అధ్యక్షుల వారికి మహజరివ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంబంధిత హైకోర్టు చీఫ్ లేదా సుప్రీంకోర్టు చీఫ్‌ల కమిటీ విచారించి తొలగించమని పార్లమెంటుకు సిఫారసు చేస్తే మహాభిశంసన తీర్మానాన్ని చర్చిస్తారు. ముద్దాయి న్యాయమూర్తిగానీ, వారి లాయర్ గానీ తన వాదాన్ని వినిపించాలి. ఉభయ సభల్లో మూడింట రెండువంతుల మంది సభ్యులు అవునంటేనే ఉద్వాసన. (ఇంతమంది పార్లమెంటు సభ్యుల మద్దత్తు ఉంటే ఏకంగా దేశప్రధానే కావచ్చు మరి) ఇది అసాధ్యమని తేలిపోయింది. దీని కన్న ఆ న్యాయమూర్తికి 62 లేదా 65 ఏళ్లు నిండేదాకా నోరుమూసుకుని ఎదురుచూడడం చాలా మంచిదని కొందరి అభిప్రాయం. మన రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన గొప్ప నియమం ఏదంటే వారి రిటైర్మెంట్ వయో నిర్ధారణ. కొన్ని దేశాల్లో ఒకసారి గద్దెనెక్కితే చాలు జీవిత పర్యంతం న్యాయమూర్తే. చక్రాలకుర్చీల్లో వచ్చి న్యాయచక్రం తిప్పుతుంటారు. ఆ యావజ్జీవ జడ్జిలను వదిలించుకోవడానికి హతమార్చడం ఒక్కటే మార్గమని కుట్ర చేసే థీమ్‌తో ఓ మహారచయిత థ్రిల్లర్ నవల కూడా రాసి పారేశాడు. ఈ నేపథ్యంలో జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నానాతంటాలుపడి తెచ్చింది. కాని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక్క మన చలమేశ్వర్ గారు తప్ప మిగిలిన నలుగురు జడ్జీలు అది రాజ్యాంగ విరుద్ధమని సెలవిచ్చారు. అదిపోయింది. అయితే ఈ అయిదుగురూ ఒక విషయంలో ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అదేమిటంటే అన్నింటి మూలం నియామకాల్లోనే ఉంది. అది అత్యంత రహస్యంగా జరుగుతున్నది. అందులో పారదర్శకత తెచ్చామా.. ఇహ మనమంతా బాగుపడిపోతామన్నారు. కానీ దాన్ని తేవడం ఎలా? కేంద్రం ఒక ప్రతిపాదన పంపింది. అందులో లోపాలున్నాయని సుప్రీం న్యాయమూర్తులు తిప్పి పంపారు. మళ్లీ సవరించి పంపారు. మన మహామహిమాన్విత దేశంలో ఎవరిని జడ్జీలుగా ఎవరు ప్రతిపాదిస్తారో, ఎందుకు ప్రతిపాదిస్తారో, చివరకు కొందరి పేర్లు ఎందుకు రాలిపోతాయో, కొందరి భాగ్యవంతుల పేర్లు ఎందుకు రాలి పోవో బ్రహ్మకు కూడా అంతుబట్టదు. పోనీ ఫలానా వ్యక్తి తాను అర్హుడనని నమ్మితే జడ్జీ పదవికి దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలో ఎవరూ చెప్పరు. ఎవరికీ తెలి యదు. మన 70 ఏళ్ల రాజ్యాంగంలో న్యాయశాస్త్ర విశారదులనుంచి కూడా సుప్రీంకోర్టు జడ్జీలను ఎంపిక చేయాలని ఉంది. జిల్లాల్లో పనిచేసిన న్యాయాధికారుల్లో కొందరు, హైకోర్టులో పనిచేసే న్యాయవాదుల్లో కొందరు హైకోర్టు జడ్జీలవుతారు. వారిలో కొందరు సుప్రీంకోర్టుకు వెళ్తారు. చాలామంది వెళ్లరు. ఎందుకో తెలియదు. అడగొద్దు. అడిగి తెలుసుకోవడానికి ఆర్టీఐ ఉపయోగపడుతుందో లేదో తెలియదు. అవన్నీ వారి వారి ప్రయివసీ పదార్థాలు కావచ్చు. కొందరు లాయర్లను నేరుగా సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తారు. కానీ న్యాయశాస్త్ర కోవిదులకు ప్రవేశ మార్గమే లేదు. ఎలా నియమిస్తారో తెలియక తొలగించే మార్గంలేక తప్పులు రుజువైనా చర్యలు ఉండక... ఏమిటిది? ఈ న్యాయమూర్తులు తమ తీర్పుల్లో చెప్పినంతకాలం సైకిల్ దొంగలు జైల్లో ఉంటూ జనం పన్నుల ఖర్చు మీద ఆధారపడి తింటుంటారు. దీనికి ఆర్టీఐ ఏం చేస్తుంది చెప్పండి. (సుభాష్ చంద్ర అగ్రవాల్ వర్సెస్ లా మంత్రిత్వ శాఖ ఇఐఇ/V /అ/2014/000989– అ కేసులో 3.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com