ఫ్యాప్సీ అధ్యక్షులుగా శివకుమార్ రుంగ్టా
సాక్షి, హైదరాబాద్: ఫ్యాప్సీ నూతన అధ్యక్షులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త శివకుమార్ రుంగ్టా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రుంగ్టా గ్లాస్టెక్ అధినేతయైన ఆయనకు గత 12 ఏళ్లుగా ఫ్యాప్సీతో అనుబంధం వుంది. గతంలో ఆయన బ్యాంకింగ్, ఫైనాన్స్, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అనేక విభాగాలకు చైర్మన్గా పనిచేశారు. ఐఐటీ అహ్మదాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఖేతాన్ గ్రూపులో చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిన శివకుమార్ రుంగ్టా అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో కెన్యా దేశానికి విదేశీ రాయబారిగా కూడా పనిచేశారు. 2012-13వ సంవత్సరంలో ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడిగా, 2013-14 సీనియర్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
సీనియర్ ఉపాధ్యక్షులుగా వి.అనీల్రెడ్డి
దశాబ్దానికి పైగా ఫ్యాప్సీతో అనుబంధం ఉన్న వి.అనీల్రెడ్డి సీనియర్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ పూర్తి చేసిన అనీల్రెడ్డి ఫ్యాప్సీ నిపుణుల కమిటీ, ట్రేడ్ కమిటీ, కామర్స్ కమిటీలకు చైర్మన్గా పనిచేశారు. 2013-14వ సంవత్సరంలో ఫ్యాప్సీకి ఉపాధ్యక్షులుగా కొనసాగారు. ఇప్పుడాయిన ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.