ప్రపంచంలో తొలి 50 సమస్యలేంటంటే..
లండన్: నిత్యం మనల్ని చాలా సమస్యలు వేధిస్తుంటాయి. అందులో కొన్ని తీవ్రత ఎక్కువున్నవయితే మరికొన్ని తక్కువ తీవ్రతగలవి. అది ఏ సమస్య అయినా, చిరాకు పెట్టించేదైనా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అందరికీ కొన్ని సమస్యలు సమానంగా ఉన్నాయని బ్రిటన్‌లో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఓ యానిమల్ చారిటీకి చెందిన సంస్థ స్పానా ఈ సర్వేను నిర్వహించింది. అది దాదాపు రెండు వేలమందిని ప్రశ్నించి కామన్‌గా ప్రపంచంలో అందరినీ వేధిస్తున్న తొలి 50 సమస్యలు ఏమిటో గుర్తించి వాటిని వెల్లడించింది.
దీని ప్రకారం ప్రపంచాన్ని వేధిస్తున్న తొలి 50 సమస్యల్లో తొలిస్థానం రన్నీ నోస్ (జలుబుతో చీముడు కారుతున్న ముక్కు)కు దక్కింది. ఎప్పుడూ చీముడు కారుతుండటం అనేది ప్రపంచంలోనే అందరినీ వేధించే తొలిసమస్యగా ఉందని ఆ సర్వే వివరించింది. దాని తర్వాత గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం, ఏదైనా కంపెనీకి ఫోన్ చేసినప్పుడు వారు హోల్డ్‌లో ఉంచడం.. అందాల్సిన డెలివరీ అందకపోవడం, వైఫై సేవలు లేకపోవడం, ఫోన్ సిగ్నల్స్ రాకపోవడం వంటి టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయని సర్వే తెలిపింది. వీటితోపాటు సాధారణంగా ఇబ్బందిపెట్టి మరికొన్ని సమస్యలేంటంటే..
♦ డోర్ టు డోర్ సేల్స్ పీపుల్
♦ ప్రజా రవాణా వాహనాల్లో నిల్చోవాల్సి రావడం
♦ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు పాస్ వర్డ్ మర్చిపోవడం
♦ దుస్తులు కొనాలనుకొని షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఏం లభించకపోవడం
♦ ఆన్ లైన్ ఆర్డర్స్ ఆలస్యంగా రావడం
♦ కొత్త షూ వేసుకున్నప్పుడు బొబ్బలు రావడం
♦ టీవీలో లైవ్ షోలు ఫార్వార్డ్ చేసే అవకాశం లేకపోవడం
♦ అనుకున్న సమయానికి బస్సులు రాకపోవడం
♦ టీ చల్లగా అవడం
♦ 4జీ సిగ్నల్ రాకపోవడం
♦ విమానంలో చిన్నపిల్లలకు సమీపంలో లేదా ఎదురుగా కూర్చోవడం
♦ ఫోన్ చార్జర్ మర్చిపోవడం
♦ ట్యాక్సీ డ్రైవర్ ఆలస్యంగా రావడంతో పాటు ఇంకా చాలా సమస్యలు ఒక ప్రాంతమని కాకుండా అందరినీ సమానంగా వేధిస్తున్నాయని సర్వే తేల్చింది.