Rupak Ronaldson
-
వినోదాల పరేషాన్
‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్’. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించారు. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ సినిమాని జూన్ 2న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రం ‘పరేషాన్’. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు.పావని కరణం, బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండమ్, సంగీతం: యశ్వంత్ నాగ్, లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ విన్సెంట్, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: విశ్వదేవ్ రాచకొండ, హేమ రాళ్లపల్లి. -
పెదరాయుడిగా సంపూర్ణేశ్
హైదరాబాద్: సంపూర్ణేశ్ బాబు.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. హృదయకాలేయం చిత్రంతో విలక్షణ నటన కనబరిచి అభిమానులను కుప్పలుగా సంపాదించుకుని బర్నింగ్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తిరిగి అదే టీంతో చేస్తున్న చిత్రం 'కొబ్బరి మట్ట'. ఈ చిత్ర టీజర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. రుపక్ రోనాల్డ్స్న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంపూర్ణేశ్ బాబు గతంలో బడా హీరోలు చేసిన పాత్రలను అనుకరించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఆయన కనిపిస్తున్నారట. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ఆయన పెద రాయుడిలా కనిపించారు. అప్పటి పెద రాయుడు చిత్రంలో మోహనబాబు ఎలాంటి వేషధారణలో కనిపించారో అచ్చం అలాగే. ఒక మహిళను కొడుతుండగా.. ఎంట్రీ ఇచ్చిన మహిళల గొప్పతనం ఏమిటో ఓ భారీ డైలాగ్‌లో గుక్క తిప్పుకోకుండా కనిపించారు సంపూర్ణేష్. ఈ డైలాగ్ పూర్తవడంతోనే ట్రైలర్ కూడా ముగిసిపోతుంది. అన్నట్లు ఈ చిత్రంలో బాహుబలి స్ఫూప్ కూడా ఉందంట.