రూపాల సంగమేశ్వరస్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
కర్నూలు(న్యూసిటీ) :నగర శివారులో జగన్నాథగట్టుపై వెలసిన రూపాల సంగమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి, ఫస్ట్‌క్లాస్ అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమావతి, జూనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి అభిషేకం నిర్వహించారు. అర్చకులు ముందుగా న్యాయమూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. అర్చకులు సురేష్ శర్మ, దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది సుబ్బారెడ్డి పాల్గొన్నారు.