ఎస్బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గురువారం రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్‌ను ఆవిష్కరించింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో ఈ కార్డు విడుదలయ్యింది. ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఎన్పీసీఐ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ ఏపీ హోత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ కస్టమర్ల జీవన శైలి, ఆకాంక్షలకు అనుగుణంగా తాజా డెబిట్ కార్డ్ ప్రయోజనాలు ఉంటాయని ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ అన్నారు.
ఏటీఎం, పీఓఎస్, ఈ కామర్స్ వంటి అన్ని పేమెంట్ చానెల్స్‌కు వినియోగానికి అనుగుణమైన ఫీచర్‌తో తాజా డెబిట్ కార్డ్‌ను ఆవిష్కరించినట్లు ఎన్పీసీఐ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ ఏపీ హోట అన్నారు. యుటిలిటీ బిల్ పేమెంట్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్, 1 శాతం వరకూ ఫ్యూయల్ సర్‌చార్జ్ తగ్గింపు, కాంప్లిమెంటరీ వెల్కమ్ డిస్కౌంట్ వోచర్స్, 2 లక్షల వరకూ బీమా కవరేజ్ వంటి సదుపాయాలు తాజా ఎస్బీఐ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డ్ ద్వారా లభించనున్నాయి.