rupee closing rate
-
రూపీ 50 పైసలు డౌన్.. కారణాలు ఇవే!
ముంబై: రూపాయి విలువ సోమవారం 50 పైసలు క్షీణించి 81.28 స్థాయి వద్ద నిలిచింది. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు అండతో ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 80.53 స్థాయి వద్ద మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన రూపాయి ఏ దశలోనూ కోలుకోలేక ఇంట్రాడే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ‘‘దేశీయ కార్పొరేట్, ఆయిల్ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఈక్విటీ మార్కెట్ స్తబ్ధుగా ట్రేడైంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగింది. ఈ అంశాలు మన కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి’’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
డాలర్ల రాకపై రూపాయి భరోసా
ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో (జూన్ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి. వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు డాలర్ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్‌పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
29 పైసలు క్షీణించిన రూపాయి
ముంబై: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో దేశీ కరెన్సీపైనా ప్రతికూల ప్రభావం పడింది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 29 పైసలు నష్టపోయి 62.04కు దిగజారింది. గడిచిన రెండు వారాల వ్యవధిలో ఇదే అత్యధిక క్షీణత కావడం గమనార్హం. డిసెంబర్ క్వార్టర్లో జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరచడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.