మృతుడి కుటంబానికి రూ.40 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రామేశ్వర్ చౌదరీ (47) కుటుంబానికి 40లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా ట్రిబ్యునల్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షి రూపేందర్ సింగ్ చెప్పిన ఆధారాలను ఎమ్ఏసీటీ అధికారి అజయ్ కుమార్ జైన్ సేకరించారు. 2011లో జూలై 12న ద్విచక్రవాహనంపై వెళుతున్న రామేశ్వర్‌ను వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే రామేశ్వర్ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా సాక్షి చెప్పిన వివరాలను డ్రైవర్, బస్సు యజమాని కోర్టు ఎదుట ఖండించారు. వీరి వాదనతో ట్రిబ్యునల్ ఏకీభవించలేదు. బస్సుకు చెందాల్సిన భీమా మొత్తాన్ని బాధితుడి కుటుంబానికి ఇవ్వాలని కోర్టు సూచించింది.