సోదర సోదరీమణులారా...
విజయవాడలో సచిన్ సందడి
సాక్షి, విజయవాడ: క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ విజయవాడలో సందడి చేశాడు. రూ.125 కోట్లతో విజయవాడలో ఏర్పాటు చేసిన ‘పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్’ను శుక్రవారం సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ‘సోదర సోదరీమణులారా’ అంటూ అభిమానులను మాస్టర్ తెలుగులో పలకరించాడు. 20 ఏళ్ల కిందట క్రికెట్ ఆడేందుకు విజయవాడకు వచ్చానని.. మళ్లీ ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సచిన్ అన్నాడు.
ఇక ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి అనుష్కతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, పైడిపల్లి వంశీ... నిర్మాతలు దిల్రాజు, కేఎస్ రావూరావు, అశ్వనీదత్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ పాల్గొన్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన సచిన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అరుుంది.