Rural development ministry
-
‘నీరాంచల్’పై రెండు రోజుల వర్క్‌షాప్
సమావేశానికి ఐదు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్రం కొత్తగా అమలు చేస్తున్న ‘నీరాంచల్’ పథకంపై రాష్ట్ర స్థాయిలో అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ హైదరాబాద్‌లో గురు, శుక్రవారాల్లో వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వర్క్‌షాపులో పాల్గొంటారని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. దేశవ్యాప్తంగా వాటర్షెడ్ల నిర్మాణంలో కొత్త పద్ధతులు అవలంబించేందుకు తొమ్మిది రాష్ట్రాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా నీరాంచల్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. పెలైట్ ప్రాజెక్టుకు ఎంపికైన ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాల చొప్పున ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయి. వర్క్ షాపులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ మదాన్ ‘నీరాంచల్’ పథకం లక్ష్యాలను వివరించనున్నారు. -
‘ఉపాధి’ ఇక కొందరికే !
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకాన్ని కొత్త తరహాలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థకు ఉత్తర్వులు కూడా అందాయి. ఇకపై జిల్లా అంతటా కాకుండా కేవలం నిరుపేదలున్న గ్రామాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 76 మండలాలకు ఈ పథకం వర్తించనుండగా.. జిల్లాలో 8 మండలాలకు చెందిన సుమారు 212 గ్రామాల్లో ‘ఉపాధి’ పనులు జరగనున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో ప్రత్యే క చర్యల ద్వారా గ్రామాలను, నిరుపేద కుటుంబాలను అభివృద్ధి చేయాలని, వారికి అండగా నిలవాలనేది కేంద్రం నిర్ణయం. గాంధారి, బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, నిజాంసాగర్‌తో పాటు మరో మూడు మండలాల్లోని గ్రామాల్లో 2015-16 సంవత్సరానికి ఉపాధి హామీ పథ కం ద్వారా పనులు చూపాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ‘ఉపాధి’.. జిల్లాలోని 36 మండలాలకు చెందిన 718 గ్రామ పంచాయతీలు, 1,297 హాబిటేషన్లలో ఉపాధి హామీ పథకం పనులను గుర్తించారు. 25,669 గ్రూపులకు చెందిన 4,48,077 మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. వీరందరికి పనులు కల్పించేందుకు మొత్తం 52,526 పనులను గుర్తించిన అధికారులు రూ.866.69 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.126.88 కోట్లు ఖర్చు చేసి 18,652 పనులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది సుమారు 1.08 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఆ మేరకు కృషి చేస్తుండగా ఇప్పటి వరకు 82 లక్షల పనిదినాలు పూర్తయినట్లు చెప్పారు. సీజన్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనుల్లో 80 వేల మంది నుంచి 1.12 లక్షల మంది వరకు కూలీలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10-15 వేల మందికి పడిపోయినట్లు చెప్తుండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 9,243 కుటుంబాలకు 100 రోజుల ‘ఉపాధి’ లభించింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం అమలు తీరు ఇలా వుంటే... కేంద్ర ప్రభుత్వం కొత్తగా పూర్తిగా నిరుపేదలున్న గ్రామాలకే పరిమితం చేయాలని జీవో జారీ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్ ‘ఉపాధి’ కార్యాచరణ.. జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది మండలాలకు చెందిన గ్రామాలకే ఉపాధి హామీ పథకం అమలవుతుంది. మురికి వాడల్లో పనులను గుర్తిస్తారు. గ్రామ ప్రజలతో చర్చించి అభివృద్ధి పనులు చేపడతారు. ఇందుకోసం ఉపాధి కూలీలకు, గ్రామ ప్రజలకు శిక్షణ తరగతులు ఇస్తారు. ఆ తర్వాత ఊరికి కావాల్సిన పనులను గుర్తించి ప్రజలతో చర్చించి సర్పంచి నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడు రోజుల్లో గ్రామసభ ఏర్పాటు చేయాలి. నవంబర్ 29లోగా గుర్తించిన పనులను గ్రామసభ, జిల్లా పరిషత్తు ఆమోదం పొందేట్లు చేస్తారు. డిసెంబర్ 20 నాటికి కలెక్టర్ అనుమతి పొందిన పనులు మొదలు పెడతారు. ఈ పనులను మూడు దశలుగా విభజించనున్నారు. మొదటి దశ కింద ప్రకృతి వనరుల పనులకు ప్రాధాన్యం ఇస్తారు. వాటర్షెడ్ల నిర్మాణం, చెరువుల మరమ్మతులు, స్థానిక ట్యాంకు, కేసీ కెనాల్లో పూడికతీత పనులు, మొక్కల పెంపకం వంటివి చేపడతారు. రెండో దశలో నిరుపేద కుటుంబాల్లో ఎస్సీ, ఎస్టీల భూమి అభివృద్ధి పనులు, వారి పొలాల్లో పండ్లతోటల పెంపకం, నిరుపయోగమైన భూమిని సాగులోకి తేవడం, కోళ్ల, గొర్రెల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మూడో దశ కింద స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక పనులు, సేంద్రియ ఎరువులు, పండ్లు దాచిపెట్టడానికి గోదాములు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలల్లో మైదానం లాంటి పనులు చేపడతారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు అందలేదు -శివలింగయ్య, పీడీ, డ్వామా 2015-16 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ కింద కొత్తగా చేపట్టే అంశాలకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు బాగా జరుగుతున్నాయి. 1.08 కోట్ల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకుంటే 85 లక్షల పనిదినాలు కల్పించాము.. మరో అరు నెలల గడువుంది... మిగతా పనిదినాలు కూడ కల్పిస్తాం. అవసరమైన పనులు చేపట్టి ఉపాధి చూపిస్తాం. -
పింఛన్‌దారులకు శుభవార్త
కాగజ్‌నగర్ రూరల్ : జిల్లాలోని నెట్‌సిగ్నల్ లేని మారుమూల పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి. ప్రతి నెలా పింఛన్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తీసుకుంటూ అష్టకష్టాలు పడేవారు. వారి ఇబ్బందులను గమనించిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ నెట్‌సిగ్నల్ లేని గ్రామ పంచాయతీలు గుర్తించి స్థానికంగానే పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లోనే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని లేఖ నంబర్ 6139/ఆర్డీ/డీబీఐ 2013 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అధికారులు జిల్లాలో 16 మండలాల్లో నెట్ సిగ్నల్ లేని 37పంచాయతీలను గుర్తించారు. ఈ పంచాయతీల ప రిధిలోని ఆయా గ్రామాల్లో పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రలు సేకరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా కమిషనర్ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పింఛన్ పంపిణీకి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేలిముద్రల సేకరణలో అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు ప్రతీ నెలా పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని అవలంభిస్తుండడంతో నెట్సిగ్నల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విధానం ద్వారా పింఛన్‌దారుడు వేలిముద్ర వేసి పింఛన్ పొందుతున్నాడు. వేలిముద్రను సరిచూడడానికి ఇంటర్నెట్ అవసరం. కొన్ని పంచాయతీల్లో నెట్‌సిగ్నల్ లేకపోవడంతో అధికారులు పక్కనే ఉన్న మరో పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేసేవారు. దీంతో కొన్ని పంచాయతీలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇతర పంచాయతీ కేంద్రాలకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకునేవారు. ఇటువంటి గ్రామాలు జిల్లాలో 37 పంచాయతీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి ఇబ్బందులను గుర్తించిన అధికారులు సిగ్నల్స్ లేకున్నా పింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఆయా పంచాయతీ కేంద్రాల్లో పింఛన్‌దారుల వేలిముద్రలు ముందే సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన వేలిముద్రలను సర్వర్‌కు అప్డేట్ చేయడం ద్వారా ప్రతీ నెలా నెట్‌సిగ్నల్ లేకుండా ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పింఛన్లు పంపిణీ చేసే సౌలభ్యం ఉంది. మరో రెండు రోజుల్లో జిల్లాలో ఎంపిక చేసిన 37 పంచాయతీల పరిధిలోని పింఛన్‌దారుల వేలిముద్రలు సేకరించి సర్వర్‌కు అప్డేట్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో నెట్సిగ్నల్స్లేని పంచాయతీలు ఆదిలాబాద్ మండలంలోని సీహెచ్ ఖానాపూర్, కుంటాల, ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్, బజార్హత్నూర్ మండలంలోని పెంబి, బెజ్జూర్ మండలంలోని కమ్మర్గాం, మొర్లిగూడ, కొండపల్లి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, చింతపల్లి, గూడెం, లింగాపూర్, గుడిరేవు, ఇచ్చోడ మండలంలో నేరడిగొండ(కె), గుడిహత్నూర్ మండలంలోని మాచాపూర్, ఇంద్రవెల్లి మండలంలోని పోచంపల్లి, వాయిపేట్, దొడంద, వల్గొండ, హీరాపూర్, వడేగాం, జన్నారం మండలంలోని కవ్వాల్, రోటిగూడ, కాగజ్‌నగర్ మండలంలోని మాలిని, లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద, చామన్‌పల్లి, నిర్మల్ మండలంలోని మేడిపల్లి, ముక్తాపూర్, సిర్పూర్(టి)మండలంలోని చీలపల్లి, తానూర్ మండలంలోని తొండల, తిర్యాణి మండలంలోని లొద్దిగూడ, పంగిడిమాదర, మంగి, మాణిక్యాపూర్, రొంపల్లి పంచాయతీలను ఎంపిక చేశారు.