పింఛన్‌దారులకు శుభవార్త | Pensions were ordered to be delivered locally | Sakshi
Sakshi News home page

పింఛన్‌దారులకు శుభవార్త

Published Fri, Jun 13 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

పింఛన్‌దారులకు శుభవార్త

పింఛన్‌దారులకు శుభవార్త

కాగజ్‌నగర్ రూరల్ : జిల్లాలోని నెట్‌సిగ్నల్ లేని మారుమూల పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి. ప్రతి నెలా పింఛన్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తీసుకుంటూ అష్టకష్టాలు పడేవారు. వారి ఇబ్బందులను గమనించిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ నెట్‌సిగ్నల్ లేని గ్రామ పంచాయతీలు గుర్తించి స్థానికంగానే పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లోనే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకోవాలని లేఖ నంబర్ 6139/ఆర్‌డీ/డీబీఐ 2013 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ ఉత్తర్వుల ప్రకారం అధికారులు జిల్లాలో 16 మండలాల్లో నెట్ సిగ్నల్ లేని 37పంచాయతీలను గుర్తించారు. ఈ పంచాయతీల ప రిధిలోని ఆయా గ్రామాల్లో పింఛన్‌దారుల నుంచి వేలి ముద్రలు సేకరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా కమిషనర్ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పింఛన్ పంపిణీకి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
 వేలిముద్రల సేకరణలో అధికారులు
జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు ప్రతీ నెలా పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానాన్ని అవలంభిస్తుండడంతో నెట్‌సిగ్నల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విధానం ద్వారా పింఛన్‌దారుడు వేలిముద్ర వేసి పింఛన్ పొందుతున్నాడు. వేలిముద్రను సరిచూడడానికి ఇంటర్నెట్ అవసరం. కొన్ని పంచాయతీల్లో నెట్‌సిగ్నల్ లేకపోవడంతో అధికారులు పక్కనే ఉన్న మరో పంచాయతీలో పింఛన్‌లు పంపిణీ చేసేవారు. దీంతో కొన్ని పంచాయతీలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇతర పంచాయతీ కేంద్రాలకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకునేవారు. ఇటువంటి గ్రామాలు జిల్లాలో 37 పంచాయతీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
 
వీరి ఇబ్బందులను గుర్తించిన అధికారులు సిగ్నల్స్ లేకున్నా పింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఆయా పంచాయతీ కేంద్రాల్లో పింఛన్‌దారుల వేలిముద్రలు ముందే సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన వేలిముద్రలను సర్వర్‌కు అప్‌డేట్ చేయడం ద్వారా ప్రతీ నెలా నెట్‌సిగ్నల్ లేకుండా ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పింఛన్లు పంపిణీ చేసే సౌలభ్యం ఉంది. మరో రెండు రోజుల్లో జిల్లాలో ఎంపిక చేసిన 37 పంచాయతీల పరిధిలోని పింఛన్‌దారుల వేలిముద్రలు సేకరించి సర్వర్‌కు అప్‌డేట్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
 
జిల్లాలో నెట్‌సిగ్నల్స్‌లేని పంచాయతీలు
ఆదిలాబాద్ మండలంలోని సీహెచ్ ఖానాపూర్, కుంటాల, ఆసిఫాబాద్ మండలంలోని అడదస్నాపూర్, బజార్‌హత్నూర్ మండలంలోని పెంబి, బెజ్జూర్ మండలంలోని కమ్మర్‌గాం, మొర్లిగూడ, కొండపల్లి, సోమిని, దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, చింతపల్లి, గూడెం, లింగాపూర్, గుడిరేవు, ఇచ్చోడ మండలంలో నేరడిగొండ(కె), గుడిహత్నూర్ మండలంలోని మాచాపూర్, ఇంద్రవెల్లి మండలంలోని పోచంపల్లి, వాయిపేట్, దొడంద, వల్గొండ, హీరాపూర్, వడేగాం, జన్నారం మండలంలోని కవ్వాల్, రోటిగూడ, కాగజ్‌నగర్ మండలంలోని మాలిని, లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద, చామన్‌పల్లి, నిర్మల్ మండలంలోని మేడిపల్లి, ముక్తాపూర్, సిర్పూర్(టి)మండలంలోని చీలపల్లి, తానూర్ మండలంలోని తొండల, తిర్యాణి మండలంలోని లొద్దిగూడ, పంగిడిమాదర, మంగి, మాణిక్యాపూర్, రొంపల్లి పంచాయతీలను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement