ఊరికి దారి
వరంగల్ : రహదారుల నిర్మాణం, పునరుద్ధరణపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్ల ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఇప్పటికీ తారు రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలకు భారీగా నిధులు కేటాయించింది. గ్రామీణ రోడ్ల నిర్మాణ(సీఆర్ఆర్) పథకం కింద పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,409 రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3,718 కిలో మీటర్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,952.22 కోట్లు విడుదల చేసింది. మన జిల్లాకు సంబంధించి కొత్తగా 155 రోడ్లను 399.53 కిలో మీటర్ల మేర తారు రోడ్లుగా నిర్మించనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.186.92 కోట్లను విడుదల చేసింది. సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఈ నిధులు కేటాయించారు. డిసెంబరు 30న ఉత్తర్వులు జారీ కాగా, రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లే ఐదేళ్లు నిర్వహణ బాధ్యతలు చూసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నెలన్నర క్రితం..
కొత్త రోడ్ల నిర్మాణం కోసం పంచాయతీరాజ్ శాఖ భారీగా నిధులు విడుదల చేసింది. 2014 నవంబర్‌లో రోడ్లు, భవనాల శాఖ రోడ్ల విస్తరణ, మరమ్మతులకు ఇదే స్థాయిలో రూ.453.35 కోట్లు విడుదల చేసింది. 24 సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.281.05 కోట్లు, మండల కేంద్రాలతో జిల్లా కేంద్రాలను అనుసంధానించే 13 సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.172.30 కోట్లు కేటాయించారు. రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు ఇలా ఒకేసారి భారీగా నిధులు కేటాయించడంతో జిల్లాలోని రోడ్ల పరిస్థితి మారిపోనుంది. నిధులు కేటాయించిన నేపథ్యంలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి ఉంది.
భూపాలపల్లి నియోజకవర్గం..
రేగొండ మండలంలో తిరుమలగిరి-రావులపల్లి-జూబ్లినగర్, రావుపల్లి-రేగొండ అప్రోచ్‌రోడ్డు, నర్సింగాపూర్-రేపాకపల్లి, పీడబ్ల్యూడీ రోడ్-జోగయ్యపల్లి, పీడబ్ల్యూడీ రోడ్-రామన్నగూడెం తండా.
భూపాలపల్లి మండలంలో నేరేడుపల్లి-వెంచరామి, కాశింపల్లి-గొర్లవీడు, లంబాడితండ-గొర్లవీడు, బెద్దలోనిపల్లి-ఖాసినిపల్లి, జంగేడు-వేశాలపల్లి-పెద్దకుంటపల్లి.
మొగుళ్లపల్లి మండలంలో ఇప్పలపెల్లి-పోతుగల్లు-కొర్కిశాల, కొర్కిశాల-బద్దంపెల్లి, ముల్కలపల్లి-కొర్కిశాల, మొట్లపల్లి-గుండ్లకర్తి-కాసులపాడు, అకినేపల్లి-దబ్యాలపల్లి క్రాస్‌రోడ్.
చిట్యాల మండలంలో జదల్పేట-బావుసింగ్‌పల్లి, గోపాలపూర్-శ్యాంనగర్, వెల్లంపల్లి-ఎంపెడ్, పంచాయతీరాజ్ రోడ్-ద్వారకాపేట, బావుసింగ్‌పల్లి-చుంచుగూడెం.
శాయంపేట మండలంలో సూరంపేట-తహారాపూర్, కాట్రపల్లి-రాజుపల్లి, మైలారం-సున్నపురాళ్లగడ్డ-పెద్దకొడెపాక, ప్రగతిసింగారం-సాధనపల్లి, కాట్రెపల్లి-గొల్లపల్లి-గంగిరేనిగూడెం.
ములుగుఘణపురం మండలంలో పరుశురాంపల్లి-బస్వరాజుపల్లి, చెల్పూరు-బొబ్బలోనిపల్లి, సీతారాంపూర్-బొంగ్లోనిపల్లి-వీర్లపల్లి.
డోర్నకల్ నియోజకవర్గం...
నర్సింహులపేట మండలంలో జయపురం-దాసుతండా-మంగళితండా, పీడబ్ల్యూడీ రోడ్-వాసురాంతండా- గంగె తండా-అమర్‌సింగ్ తండా-బక్క చంద్రు తండా, పీడబ్ల్యూడీ రోడ్-నర్సింహులపేట-ముదావత్ తండా, పీఆర్ రోడ్-పూసల తండా-బీల్య తండా-కొమ్ములవంచ, పీడబ్ల్యూడీ రోడ్-రమానుజపురం- పెద్దముప్పారం, కౌసల్యదేవిపల్లి-బొజ్జన్నపేట ఎక్స్‌రోడ్ -కౌసల్యదేవిపల్లి-రూట్ల తండా.
డోర్నకల్ మండలంలో ఆర్అండ్ బీ రోడ్- బీసీ కాలనీ డోర్నకల్, మన్నెగూడెం-కొత్తతండా- శివునిగుడి తండా- అందనాలతండా, పెరుమాండ్ల సంకీస ఆర్ అండ్ బీరోడ్-మల్లై కుంట- ధాన్య తండా- మన్నేగూడెం ఆర్ అండ్‌బీ రోడ్, పీఆర్ రోడ్ గొల్లచర్ల- లచ్యా తండా, పీఆర్ రోడ్- చింతల తండా, పీఆర్ రోడ్ -కంసాలి తండా, పీఆర్రోడ్-ఉయ్యాలవాడ-గొర్లకుంట తండా
మరిపెడ మండలంలో పీడబ్ల్యూడీ రోడ్ తానంచర్ల-రంగాపురం-రెడ్యా తండా - ఆర్లగడ్డ తండా -చూళ్ల తండా- కొత్యే తండా, వీరారం-కేలోతు తండా-అజ్మీరా తండా- ఎల్లంపేట, పీడబ్ల్యూడీ రోడ్-జీన్య తండా, పీఆర్ రోడ్-పూసల తండా-వీరారం, పీఆర్ రోడ్-వీరారం-వెంకట్రాంనాయక్ తండా. పీడబ్ల్యూడీ రోడ్-బీమ్ల తండా-సోమ్ల తండా. పీఆర్ రోడ్-నీలికుర్తి-రేక్య తండా, పీఆర్ రోడ్-దాస్య తండా-పీడబ్ల్యూ-ఎల్లంపేట-మచ్చ తండా, పీడబ్ల్యూడీ రోడ్-పర్కజ తండా-నేతావత్ తండా
కురవి మండలంలో పీడబ్ల్యూడీ రోడ్- దూప్‌సింగ్ తండా -కీమ్య తండా-కొర్వి- తుల్సింగ్ తండా-పీడబ్ల్యూడీ రోడ్ -తుక తండా, పీడబ్ల్యూడీ రోడ్-బురుగు చెట్టు తండా, ఆర్అండ్బీ రోడ్-తాళ్ల సంకీస-గల్ల తండా, నల్లెల్ల- లింగ్యా తండా
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం..
రఘునాథ్‌పల్లి మండలంలోని జెడ్పీ రోడ్- మందలగూడెం, పుచ్చపల్లి- ఇప్పగూడెం-కంచనపల్లి-మల్లంపల్లి, కన్నాలపల్లె-బాంజీపేట, జడ్పీరోడ్- కన్నాయిపల్లె.
పీఆర్రోడ్ దేశాయితండ- మారెపల్లిగూడెం, ఖిలాషాపూర్ ఎక్స్‌రోడ్- ఆంధ్ర తండా-మచ్చుపహాడ్.
ధర్మసాగర్ మండలంలోని మల్లక్కపల్లి -గుంటూర్పల్లి, వేలేరు-కొత్తకొండ, ఎలకుర్తి-రామన్నగూడెం, పీసర- మద్దెలగూడెం-కొమ్ముగుట్ట కాలనీ, క్యాతంపల్లి- పెద్ద పెండ్యాల, రెసిడెన్సియల్ స్కూల్ వేలేరు- ఉప్పరపల్లి .
స్ట్టేషన్ఘన్పూర్ మండలంలోని వంగాలపల్లి-నష్కల్, కోమటిగూడెం- బోయినిగూడెం, లింగంపల్లి-యాపలగోల తండా .
లింగాలఘనపురం మండలం కొత్తపల్లి-లింగాలఘన్పూర్, లింగాలఘనపురం -కళ్లెం.
జఫర్‌గఢ్ మండలం సాగరం-తిడుగు, హిమ్మత్‌నగర్-ఓల్డ్ ఎస్సీ కాలనీ- తిమ్మాపూర్ న్యూ ఎస్సీ కాలనీ
జనగామ నియోజకవర్గం..
మద్దూరు మండలంలోని తోమల-బెక్కల్, మద్దూరు-గజిలాపూర్-లింగాపూర్.
చేర్యాల మండలంలోని ఆర్ అండ్‌బీ రోడ్ ఆకునూర్-కొత్త దొమ్మాట, ఐనాపూర్-టపాస్‌పల్లి, మసిరెడ్డిపల్లి-ఆర్అండ్బీరోడ్-ఆకునూరు
బచ్చన్నపేట మండలం అలింపూర్ పీడబ్ల్యూడీ రోడ్-గంగాపూర్-నాగిరెడ్డిపల్లి -పీడబ్ల్యూడీ రోడ్ చేర్యాల
నర్మెట్ట మండలంలోని అంకుషాపూర్-బయ్యన్నచెరువు తండా, పోతారం- ఉప్పరోనిగడ్డ, పోతారం-అక్కరాజుపల్లి, మాన్సింగ్ తండా-శివబీక్యాతండా-సోమ్లాతండా, బొత్తలపర్రె-కన్నారం.
జనగామ మండలంలోని పీఆర్రోడ్ మరిగడి- టీకే తండా, యశ్వంతాపూర్ -చౌడారం, పీడబ్ల్యూడీ రోడ్-అడవి కేశవపూర్
పరకాల నియోజకవర్గం..
పరకాల మండలంలోని చౌటుపర్తి-చర్లపల్లి, వరికోలు-నార్లాపూర్, పీడబ్ల్యూటీ రోడ్- నర్సక్కపల్లి ఆర్ అండ్బీరోడ్-వెల్లంపల్లి ఎక్స్‌రోడ్, పీడబ్ల్యూటీ రోడ్నగరం -పైడిపల్లి-కానిపర్తి.
ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడ్-కొత్తగట్టు, దమ్మన్నపేట-ల్యాదెళ్ల, సమ్మక్క జాతర-కామారం జడ్పీ రోడ్-చౌళ్లపల్లి.
సంగెం మండలంలోని చింతలపల్లి-పల్లారుగూడ, కాట్రపల్లి-గవిచర్ల, పీడబ్ల్యూటీ రోడ్డు మచ్చాపూర్-వంజరపల్లి-పల్లారుగూడ, గుంటూర్పల్లి-బొల్లికుంట, పీడబ్ల్యూటీ రోడ్-నల్లకుంట, పీఆర్రోడ్-వడ్డెరగూడెం, పీడబ్ల్యూటీరోడ్ నల్లకుంట-గుంటూర్పల్లి.
గీసుగొండ మండలంలోని బీటీ-పీడబ్ల్యూటీ రోడ్- నందానాయక్ తండా, ఆర్ అండ్ బీరోడ్-గుంటూర్పల్లి-కాలనీ తండా-ఎన్ఎన్ తండా-డోక్య తండా
వర్ధన్నపేట నియోజకవర్గం
వర్ధన్నపేట మండలంలోని డీసీ తండా- ల్యాబర్తి , లింగవారిగూడెం-గర్నెపల్లి
చెన్నారం-కాశగూడెం, ఆర్అండ్బీరోడ్-కక్కిరాలపల్లి-కుమ్మరిగూడెం, ఇల్లంద-కక్కిరాలపల్లి- ఐనవోలు, జెడ్పీరోడ్ -నల్లబెల్లి-తిమ్మాపూర్-ఎస్సీ కాలనీ.
హసన్‌పర్తి మండలం సిద్దాపూర్-హరిశ్చంద్రనాయక్ తండా, హసన్‌పర్తి- గుంటూర్పల్లి- సీతంపేట, గుంటూర్పల్లి- పెంబర్తి, నాగారం -అంబాల ఎక్స్‌రోడ్, పీడబ్ల్యూడీ రోడ్-రెడ్డిపురం-వంగపహాడ్, బైరాన్‌పల్లి-హెచ్‌సీఎన్ తండా
హన్మకొండ మండలంలోని కొండపర్తి -తరాలపల్లి, కొండపర్తి -వెంకటాపూర్
పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు ఎస్సీ కాలనీ-బుచ్చు-మంగళి- వాంకుడోతు తండా-గాటెపల్లి తండా, పర్వతగిరి సబ్ స్టేషన్ నుంచి చింత నెక్కొండ.
మహబూబాబాద్ నియోజకవర్గం
గూడూరు మండలంలోని అయోధ్యపూర్ ఎక్స్‌రోడ్ నుండి బొల్లెపల్లి ఎక్స్‌రోడ్
నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం- చిన్న నాగారం, మేచరాజుపల్లి- కొత్తూరు తండా- లింగూర్తి ఆర్ అండ్ బీరోడ్-ఆర్అండ్బీ రోడ్-ఎర్రకుంట తండా ఎక్స్‌రోడ్-తొర్రికుంట తండా-మల్లన్నగూడెం-గొల్లగూడెం. తీగలవేణి- లక్ష్మీపురం ఎక్స్‌రోడ్.
కేసముద్రం మండలం పెనుగొండ -లక్ష్మీపురం, ఆర్ అండ్ బీ తిమ్మంపేట- కోరుకొండపల్లి.
మహబూబాబాద్ మండలం బేతోలు పీడబ్ల్యూడీ రోడ్-మల్యాల-హరిజనవాడ. ఆర్ అండ్‌బీ రోడ్-వేమునూర్- నేతాజీతండా.
ములుగు నియోజకవర్గం..
వెంకటాపురం మండలంలోని ఆర్ అండ్ బీ రోడ్-నర్సాపూర్- పాలంపేట
మంగపేట మండలంలోని గాంధీనగర్ -పూరేడ్పల్లి, ఆర్ అండ్ బీ రోడ్ మల్లూర్- మామిడిగూడెం.
కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి- తిమ్మాపూర్.
ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం- సర్వాయి, ఏటూరునాగారం ఆర్ అండ్ బీ రోడ్-కన్నాయిగూడెం- చిట్యాల.
ములుగు మండలంలోని రాణిగూడెం-కొత్తూరు-యాపలగూడెం, పీఆర్ రోడ్ టూ పత్తిపల్లి - కొడిశాలకుంట-చింతకుంట.
కాశీందేవిపేట-కన్నాయిగూడెం.
తాడ్వాయి మండలం ఆర్ అండ్ బీ రోడ్ - కామారం, ఆర్ అండ్ బీ రోడ్ -కౌశెట్టివాయి .
గోవిందరావుపేట మండలంలోని కొత్తగూడ-సండ్రగూడెం-లక్ష్మీపురం
నర్సంపేట నియోజకవర్గం..
నెక్కొండ మండలంలోని ముదిగొండ-కొత్తపెల్లి శివారు, రెడ్లవాడ ఆర్ అండ్ బీ రోడ్- మత్తడి తండా-నాజీతండా-తుమ్మల చెరువు-ఆర్ అండ్‌బీ రోడ్ ఎస్సీ కాలనీ రెడ్ల వాడ వరకు. రెడ్లవాడ-బొట్లకొండ-బడికింది తండా.
పాలకుర్తి నియోజకవర్గం..
పాలకుర్తి మండలం దర్దపల్లి -గుండెళ్లిగూడెం, పీడబ్ల్యూటీ రోడ్ - రాఘవపురం-క్రిష్టాపురం, పీడబ్ల్యూటీ రోడ్- విస్నూర్- హరిజన వాడ, బొమ్మెర-ఇప్పలకుంట తండా. కొడకండ్ల మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్- పోచారం ఆర్సీ తండా