తాగునీటి పథకాల టెండర్లలో అవగాహన
బాన్సువాడ, న్యూస్‌లైన్: బాన్సువాడలోని ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా పథకం) డివిజన్ కార్యాలయంలో మంగళవారం కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి తాగునీటి పథకాల పనులను దక్కించుకున్నారు. బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాల్లో ఉన్న తాగునీటి పథకాల నిర్వహణకు ఆ శాఖ టెండర్ల ను ఆహ్వానించింది. ప్రజలకు మంచినీటి సరఫరా సందర్భంగా క్లోరినేష న్, పైప్లైన్ల నిర్వహణ, ట్యాంకుల్లో నీరు నింపడం తదితర పనులు ఈ పథకాల ద్వారా చేయాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఈ పథకాల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్లు అవగాహనకు వచ్చి, ఎలాంటి పోటీ లేకుండా పనులు సాధించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ సారి సైతం కాంట్రాక్టర్లందరూ ఏకమై పోటీ లేకుండా చేశారు. ఈ సారి ఒక్కొక్క నిర్వహణ పథకానికి అధికారులు భారీగానే అంచనా వ్యయం పెంచారు. ఇది కాంట్రాక్టర్లకు కలిసివచ్చింది. అధికారులు-కాంట్రాక్టర్లు లోలోపల అవగాహనకు వచ్చి తూతూమంత్రంగా టెండర్ల దరఖాస్తులను స్వీకరించినట్లు తెలుస్తోంది. పోటీ లేకపోవడంతో అధికారులు తయారు చేసిన అంచనా వ్యయానికే టెండర్లు ఖరారయ్యాయి. దీంతో తోటి కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులకు పర్సంటేజీలు లభించాయి.
ఇదీ సంగతి
బాన్సువాడ పట్టణంలోని తాగునీటి పథకం నిర్వహణకు రూ. 7.32 లక్షల వ్యయంతో టెండర్లను ఆహ్వానించగా, 10 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకొన్నారు. వారంతా ఏకం కావడంతో భారీగా డబ్బులు చేతులు మారాయి. చివరకు ఒక కాంట్రాక్టర్ పోటీ లేకుండా, అంచనా వ్యయానికి సమానంగా టెండర్ దాఖలు చేశారు. ఒకవేళ కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉం టే 10 నుంచి 20 శాతం తక్కువకు దాఖలు చేసే అవకాశం ఉండేది.
కానీ సిండికేట్ కారణంగా అంచనా వ్యయానికి సమానంగానే ఖరారైంది. కోటగిరి మం డలంలోని మందర్న మంచినీటి నిర్వహణ పథకానికి రూ.7.24 లక్షలతో టెండర్‌ను ఆహ్వానించగా 11 మంది దరఖాస్తు చేసుకొన్నారు. అంచనా వ్యయానికి సమానంగా దరఖాస్తు చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కాయి. బిచ్కుంద తాగునీటి పథకానికి అంచనా వ్యయం రూ. 4.5 లక్షలు కాగా, 10 మంది దర ఖాస్తు చేసుకొన్నా, టెండర్ ఫారాలను తీసుకొన్న వారందరూ ఎక్సెస్‌తో దాఖలు చేసి, అవగాహన కుదుర్చుకొన్న కాంట్రాక్టర్‌తో సమానంగా వేయించారు. దీం తో సమానంగా దరఖాస్తు చేసిన కాంట్రాక్టర్‌కే పను లు దక్కాయి. జుక్కల్ మండలం నాగల్గాం గ్రామం లో రూ. 3.3లక్షలతో టెండర్‌ను ఆహ్వానించగా, 8 దరఖాస్తులు వచ్చాయి.
అయితే కాంట్రాక్టర్ల మధ్య అవగాహన కుదరడంతో అంచనా వ్యవయానికి స మానంగా దరఖాస్తు చేసుకొన్న కాంట్రాక్టర్‌కే పనులు లభించాయి. బీర్కూర్ మండలం దామరంచ గ్రా మంలో రూ. 10 లక్షలతో మంచినీటి పథకాల నిర్వహణకు టెండర్‌ను ఆహ్వానించగా, 10 దరఖాస్తు ఫారాలు అమ్ముడు పోయాయి. చివరకు అవగాహన కుదుర్చుకున్న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కోటగిరి మంచినీటి పథకానికి రూ. 8.88 లక్షల అం చనా వ్యయం కాగా, 11 మంది దరఖాస్తులు తీసుకున్నారు. ఎవరూ టెండర్ ఫారాన్ని దాఖలు చేయలేదు. దీంతో ఈ పథకానికి సంబంధించి టెండర్ ఖరారు కాలేదు. వర్నీ మండలం తగిలేపల్లిలో రూ. 3.98 లక్షల అంచనా వ్యయంతో టెండర్‌ను ఆహ్వానిం చినా, కాంట్రాక్టర్ల మధ్య అవగాహన కుదరలేదు. ఏడుగురు కాంట్రాక్టర్లు దరఖాస్తు చేసుకోగా, పోటీ పె రిగి, అత్యధికంగా 32 శాతం లెస్తో దరఖాస్తు చేసుకొన్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. పోటీ అధికం గా ఉన్నందున ప్రభుత్వానిక సుమారు లక్ష రూపాయల నిర్వహణ ఖర్చు తగ్గింది.
వాయిదా పడిన పైప్‌లైన్ నిర్మాణ టెండర్లు
మంగళవారం జరగాల్సిన పైప్‌లైన్ నిర్మాణ పనుల టెండర్లను అధికారులు వాయిదా వేశారు. బాన్సువాడలో రూ. 10 లక్షలతో, కోటగిరి మండలం కొడ్చిర్ల లో రూ.10 లక్షలతో, బిచ్కుంద మండలం భీమ్లా తాండలో రూ. 7 ల క్షలతో, సీరాంపల్లిలో రూ. 8 లక్షలతో, తక్కడ్‌పల్లి తాండలో రూ. 8 లక్షలతో, జుక్కల్ మండలం శాంతినగర్‌లో రూ. 10 లక్షలతో, సోపూర్లో 8 లక్షలతో , మద్నూర్ మండలం అంతాపూర్లో రూ. 10 లక్షలతో, నిజాంసాగర్ మండలం గున్కుల్‌లో రూ. 8 లక్షలతో, పిట్లం మండలం కోమట్చెర్వు తాండలో ’7.12లక్షలతో పైప్‌లైన్ పనులకు టెండర్లను ఆహ్వానించారు. మంగళవారం తాగునీటి పథకా ల నిర్వహణ టెండర్లు ఖరారవడంతో, వీటిని వచ్చేనెల మొదటి వారానికి వాయిదా వేశారు.
దరఖాస్తులను పరిశీలిస్తున్నాం
- వసంత్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ
తాగునీటి పథకాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకొన్న వారి అంచనా వ్యయాలను పరిశీలించాం. లెస్ తో దరఖాస్తు చేసుకొన్న వారికే టెండర్లు దక్కుతాయి. పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపిస్తాం.