russia man
-
‘మీ సరదా కోసం చిన్నారిని హింసిస్తారా?’
కౌలాలంపూర్ : ప్రపంచ పర్యటనకై డబ్బులు సేకరించేందుకు ఓ రష్యన్ జంట తమ చిన్నారి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. వీధుల్లో నాలుగు నెలల పసికందుతో విన్యాసాలు చేస్తూ తమాషా చేసింది. దీంతో ఆగ్రహించిన మలేషియా పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రపంచ పర్యటన చేయాలని భావించాడు. ఇందులో భాగంగా సోమవారం కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పర్యటన ఖర్చుల నిమిత్తం డబ్బు సేకరించేందుకు సదరు వ్యక్తి తన కూతురిని గాల్లోకి ఎగురవేస్తూ వివిధ రకాల విన్యాసాలు చేశాడు. ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా తలకిందులుగా వేలాడదీస్తూ తన ఆటను కొనసాగించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న చిన్నారి తల్లి.. ‘ మేము ప్రపంచ పర్యటన చేస్తున్నాం’ అనే ప్లకార్డు పట్టుకుని కూర్చుని ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోపై మండిపడిన నెటిజన్లు.. ‘ స్టుపిడ్.. మీ సరదా కోసం చిన్నారిని ఇలా హింసిస్తారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
కోపంతో భార్యపై వెరైటీ ప్రతీకారం
మాస్కో: కోపంతో ఓ భర్త తన భార్యపై వెరైటీగా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమె కారు నిండా సిమెంటు కాంక్రీటును నింపి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. రష్యాలో ఓ సూపర్ మార్కెట్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అయింది. దాదాపు 20లక్షలమందికిపైగా చూసిన ఈ వీడియో మరింత దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో ప్రకారం ఓవర్నీ(నమ్మకం) అనే స్థానిక చిన్న సూపర్ మార్కెట్ తన ప్రచారంలో భాగంగా ఎవరు సర్ నేమ్‌గా తన పేరును పెట్టుకుంటే వారికి దాదాపు రూ.57వేల ప్రైజ్ మనీ ఇస్తుంది. దీనిని అందుకునేందుకు ఓ వ్యక్తి భార్య ఏకంగా తన భర్త తరుపున వచ్చిన ఇంటిపేరును తొలగించుకొని ఆ స్టోర్ పేరును తన ఇంటిపేరుగా పెట్టుకుందంట. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ భర్త తన భార్య కారును అదే స్టోర్ ముందుకు తీసుకొచ్చి ఓ సిమెంట్ కాంక్రీటు మిక్సింగ్ లారీని పిలిపించి ఆ కారులోని అద్దం గుండా మొత్తం కాంక్రీటును నింపేశాడు. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా తన భార్య చేష్టలపై కోపంతో అని నవ్వుతూ బదులిచ్చాడు. అయితే, ఇదంతా కూడా సూపర్ మార్కెట్ ప్రమోషన్లో భాగంగానే ఈ వీడియో కావాలని రూపొందించి ఆన్లైన్లో పెట్టినట్లు పలువురు విమర్శిస్తున్నారు.