Russia victory day
-
ఉక్రెయిన్ గడ్డ మీది ‘మాతృభూమి’ రక్షణ కోసమే.. : పుతిన్
అంచనాలను తలకిందులు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘విక్టరీ డే’ సందర్భంగా సాదాసీదా ప్రకటన చేశారు. సోమవారం మాస్క్ రెడ్ స్క్వేర్ దగ్గర వేలాది మంది సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారాయన. ఉక్రెయిన్ గడ్డ మీది ‘మాతృభూమి’ రక్షణ కోసమే రష్యా బలగాలు పోరాడుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. నాజీయిజానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ గడ్డపై పోరు కొనసాగుతుందని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచ యుద్ధంతో మరోసారి భయానక పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఆమోదయోగ్యం కాని ముప్పుతో రష్యా పోరాడుతోందని చెప్పిన పుతిన్.. అంతా ఊహించినట్లు యుద్ధంపై కీలక ప్రకటనేమీ చేయలేదు. అంతకు ముందు.. విక్టరీ డే వేదికగా పుతిన్.. యుద్ధాన్ని తీవ్రతరం చేయబోతున్నట్లు లేదంటే యుద్ధవిరమణ ప్రకటన చేయొచ్చంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాతృభూమి కోసం మీరంతా పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రష్యా రక్షించుకునే యత్నం చేస్తోంది. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా. కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దూ’’ అంటూ ప్రసంగించారాయన. ఈ సంక్షోభానికి.. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించిన పుతిన్.. కీవ్, దాని మ్రితపక్షాలు రష్యాకు చెందిన చారిత్రక ప్రాంతాలను(రష్యన్ భాష మాట్లాడే డోనాబస్ రీజియన్, క్రిమియా ప్రాంతాన్ని..) ఆక్రమించే యత్నం చేశాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మరో ఛాయిస్ లేదు. రష్యా సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకున్న సరైన నిర్ణయం అని మిలిటరీ చర్యను సమర్థించారాయన. ఇక నాజీ జర్మనీని ఓడించిన ఘట్టానికి సోమవారం నాటికి 77 ఏళ్లు వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రెడ్ స్క్వేర్ వద్ద పదకొండు వేల మంది సైన్యం, 130 మిలిటరీ వాహనాలతో భారీ ఎత్తున్న ప్రదర్శనలు నిర్వహించారు. #Putin said that #American veterans were not allowed to attend the Victory Parade in #Moscow. pic.twitter.com/fRbi7IvZm7 — NEXTA (@nexta_tv) May 9, 2022 చదవండి: తల్చుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం!! -
రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన?
రష్యాలో సోమవారం జరిగే విక్టరీ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నగరాలు, పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండున్నర కోట్లమందికి పైగా రష్యన్లు మరణించారని అంచనా. ఇక పుతిన్ రష్యా పగ్గాలు చేపట్టాక ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు.రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతోపాటు, రష్యా ఆయుధ సామర్ధ్యాన్ని, సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారు. పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన చేయబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం
కీవ్/లండన్/మాస్కో: రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేస్తోంది. సామాన్య పౌరులు తలదాచుకున్న శిబిరాలను కూడా వదిలిపెట్టకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని బిలోహోరివ్కా గ్రామంలో ఓ పాఠశాలపై శనివారం రష్యా జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో జనం మరణించినట్లు స్థానిక గవర్నర్ సెర్హీ హైడే ప్రకటించారు. ఈ స్కూల్లో దాదాపు 90 మంది ఆశ్రయం పొందుతున్నారు. రష్యా బాంబు దాడుల్లో స్కూల్ భవనం పూర్తిగా నేలమట్టమయ్యింది. ఇప్పటిదాకా రెండు మృతదేహాలను గుర్తించామని, 30 మందిని రక్షించామని గవర్నర్ తెలిపారు. మరో 60 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారని, వారంతా మరణించినట్లు నిర్ణయానికొచ్చామని వెల్లడించారు. అలాగే ప్రైవిలియా పట్టణంలో రష్యా దాడుల్లో ఇద్దరు బాలురు బలయ్యారు. మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌ను రష్యా సైన్యం దాదాపుగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడుతామని ఇక్కడి ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు.స్టీల్‌ప్లాంట్ ఉన్న సాధారణ ప్రజలను శనివారం నాటికి పూర్తిగా ఖాళీ చేయించారు. నల్లసముద్ర తీరంలోని అతిపెద్ద ఓడరేవు ఒడెసాపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం అక్కడ పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖర్కీవ్ సమీపంలో ఉక్రెయిన్ దళాల ప్రతిదాడుల్లో రష్యా లెఫ్టినెంట్ కల్నల్ మృతిచెందాడు. దీంతో యుద్ధంలో ఇప్పటిదాకా మరణించిన రష్యా సైనిక ఉన్నతాధికారుల సంఖ్య 39కు చేరింది. యూకే అదనపు సాయం 1.3 బిలియన్ పౌండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్‌కు అదనంగా 1.3 బిలియన్ పౌండ్ల సైనికపరమైన సాయం అందిస్తామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తోపాటు ఇతర జి–7 దేశాల అధినేతలు ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన అన్యాయమైన యుద్ధం వల్ల కేవలం ఉక్రెయిన్ నష్టపోవడమే కాదు మొత్తం యూరప్ భద్రత, శాంతికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని పుతిన్‌కు హితవు పలికారు. రష్యా ‘విక్టరీ డే’ రష్యాలో సోమవారం జరిగే విక్టరీ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నగరాలు, పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు ప్రా«ధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారు. పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన చేయబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యా విక్టరీడే సంబరాలు