రష్యాలో సోమవారం జరిగే విక్టరీ డే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నగరాలు, పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండున్నర కోట్లమందికి పైగా రష్యన్లు మరణించారని అంచనా. ఇక పుతిన్ రష్యా పగ్గాలు చేపట్టాక ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు.రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతోపాటు, రష్యా ఆయుధ సామర్ధ్యాన్ని, సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తుంటారు.
అయితే ఈసారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారు. పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన చేయబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి: Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా పాశవికం
Comments
Please login to add a commentAdd a comment