Russian airline
-
విమానంలో వర్షం.. ఎప్పుడైనా చూశారా?
మాస్కో : విమానంలో వర్షం కురిసే సంఘటనల్ని మనం ఊహిస్తామా? విమానంలో వర్షం రావడమేంటి అనుకుంటున్నారా? రష్యా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఖబరోవ్స్క్ నుంచి నల్ల సముద్రానికి వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేయాలనుకున్న పలువురు ఔత్సాహికులు విమానంలో బయలు దేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే వాన కురవడం మొదలైంది. విమానం క్యాబిన్ లోకి వర్షపు నీరు చేరిపోయింది. దీంతో పలువురు ప్రయాణికులు విమానంలో గొడుగులు పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రోసియా ఎయిర్ లైన్స్ అధికారులు విచారణ జరపగా అది వర్షం నీరు కాదని పేర్కొన్నారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే నీరు క్యాబిన్లోకి చేరిందని పేర్కొన్నారు. Volo interno russo #Chabarovsk-Sochi della Rossiya Airlines I passeggeri sono stati costretti ad usare ombrelli per ripararsi da goccioloni d'acqua, parrebbe per un guasto all'aria condizionata Ora sotto inchiesta Non vi lamentate dei treni italiani...pic.twitter.com/HKB1ab66rd — #POLiticamenteScorretto🎹FR© (@PolScorr) July 11, 2020 -
విమానంపై పిడుగు!
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం రాత్రి సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానప్రమాదానికి పిడుగుపాటే కారణమని విమాన పైలట్ డెనిస్ యెవ్‌డొకిమొవ్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తాము బయలుదేరిన కొద్దిసేపటికే సంభవించిన పిడుగుపాటు కారణంగానే తమ విమాన సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, తాము అత్యవసర నియంత్రణ పద్ధతిలోకి మారినప్పటికీ సమాచారాన్ని సరిగ్గా చేరవేయలేక పోతుండటంతో మాస్కోకు తిరిగొచ్చామని చెప్పారు. అయితే పిడుగు నేరుగా విమానంపైన పడిందా లేదా పక్కన ఎక్కడైనానా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. కూలిపోయిన సమయంలో తమ విమాన ఇంధన ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయనీ, ఈ కారణంగానే మంటలు అంటుకుని ఉండొచ్చని అన్నారు. ఈ ప్రమాదంపై రష్యా ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయగా, అననుకూల వాతావరణం, పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడానికితోడు పైలట్లకు తగినంత అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు వారు చెప్పారు. ప్రమాదంలో 41 మంది చనిపోగా 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మాస్కోలోనే అత్యంత రద్దీ విమానాశ్రయమైన షెరెమెటయెవో ఎయిర్‌పోర్ట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మాస్కో నుంచి ముర్మాన్స్క్కు వెళ్లేందుకు ఏరోఫ్లోట్ విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ 100 విమానం (ఎస్‌యూ–1492) సాయంత్రం 6.02 గంటలకు (రష్యా కాలమానం ప్రకారం) బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులతోపాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో మళ్లీ 6.30 గంటలకు మాస్కోకు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నిస్తుండగా రన్ వే పైనే కూలి మంటలు అంటుకున్నాయి. విమానం లోపల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం మొదలైంది. పైలట్‌తో పాటు కొంతమంది ప్రయాణికులు అత్యవసర మార్గాల ద్వారా బయటపడగా, మరికొంత మంది సకాలంలో బయటకు రాలేక మంటలకు ఆహుతయ్యారు. అధికారులు బ్లాక్ బాక్స్‌లను బయటకు తీసి దర్యాప్తు జరుపుతున్నారు. -
రష్యాలో విమాన ప్రమాదం, 50 మంది మృతి
స్థానిక ఎయిర్ లైన్ కు చెందిన బోయింగ్ 737 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైన ఘటనలో 50 మంది మృతి చెందారు. ఈ విమానంలో 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటన వెస్టర్న్ తతర్స్ఠాన్ సమీపంలో చోటుచేసుకుంది. మాస్కో డమోదేద్వ్ ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న విమానం కజన్ లోని ఓల్గాలో 7.25 ప్రమాదానికి గురైంది. రన్ వేను ఢికొట్టడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురి కావడానికి ముందు మూడు సార్లు ల్యాండింగ్ అవటానికి ప్రయత్నం జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.