Russian tennis star
-
'నేనొక లెస్బియన్'.. రష్యన్ టెన్నిస్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
రష్యన్ మహిళా టెన్నిస్ స్టార్.. ప్రపంచ నెంబర్ 12.. డారియా కసత్కినా స్వలింగ సంపర్కంపై సంచలన ఆరోపణలు చేసింది. తాను లెస్బియన్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాని.. ఎల్జీబీటీక్యూ(LGBTQ), హోమో సెక్సువల్పై రష్యా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక 1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది. ఇటీవలే రష్యా ప్రజా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాలపై సమాచారాన్ని నిషేధించే మరిన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది. దీంతో దేశంలో స్వలింగ సంపర్కులు కన్నెర్రజేశారు. తాను లెస్బియన్ అన్న విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించిన కసత్కినా.. రష్యన్ స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియా జబైకో తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ‘మై క్యూటీ పై’ అని షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘రష్యాలో ఇంతకంటే ముఖ్యమైన అంశాలెన్నో నిషేధించడానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమేమీ షాకింగ్ గా అనిపించలేదు..ప్రభుత్వం చెప్పినట్టు మీ భాగస్వామితో గదిలోనే జీవించడం, బయట మాట్లాడకపోవడం అనే దాంట్లో అర్థం లేదు. మీరు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది మీ ఇష్టం. ఏం చెప్పాలి..? ఏం చెప్పకూడదు అనేది వ్యక్తులకు సంబంధించిన విషయం.’అని తెలిపింది. కాగా గతవారం రష్యన్ మహిళా ఫుట్‌బాలర్ నడ్య కరపోవా కూడా స్వలింగ సంపర్కంపై తనదైన శైలిలో స్పందించింది. కసత్కినా స్పందిస్తూ.. ‘కరపోవా ఈ విషయంలో మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ ఇంకా చాలా మంది మాట్లాడాలి. ముఖ్యంగా అమ్మాయిలు దీని మీద గళం వినిపించాలి. ఇలాంటి సందర్భాల్లో యువతకు మద్దతు కావాలి.మరీ ముఖ్యంగా క్రీడలలో ఉండే వ్యక్తులు చాలామందిని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ల ఈ సమస్య గురించి విరివిగా మాట్లాడాలి.’ అని పేర్కొంది. @DKasatkina mama I’m a criminal pic.twitter.com/cCU05hr9tv — Natalia Zabiiako (@NataliaZabiiako) July 19, 2022 చదవండి: World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ -
'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా వైఖరిని ఆ దేశ స్టార్ టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ ఏకిపారేశాడు. యుద్దాన్ని వెంటనే ఆపేయాలని.. శాంతి పద్దతిలో చర్చలు జరిపితే మంచిదని అభిప్రాయపడ్డాడు. దుబాయ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం పొలాండ్‌కు చెందిన హుబెర్ట్ హుర్కాజ్తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. మ్యాచ్‌లో 3-6,7-5,7-6(5)తో హుర్కాజ్‌ను మట్టికరిపించిన రుబ్లెవ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. కాగా విజయం అనంతరం మీడియాతో మాట్లాడాడు. ''చర్చలతో పోయేదాన్ని రష్యా అనవసరంగా పెద్దదిగా చేస్తోంది. నా సొంత దేశమైనప్పటికి మేం చేస్తున్నది తప్పు. ఉక్రెయిన్ తప్పు ఉండొచ్చు.. కానీ మంచి హోదాలో ఉన్న రష్యా.. బలం లేని చిన్న దేశంపై దాడికి దిగడం అమానుషం. మ్యాచ్ గెలిచినప్పటికి నాకు సంతృప్తి లేదు. ఈ విజయాన్ని యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ వాసులకు అంకితం చేస్తున్నా. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఇప్పటికై యుద్ధం ఆపేయండి.'' అంటూ చెప్పుకొచ్చాడు. చివరలో 'నో వార్' అని కెమెరా లెన్స్‌పై రాసి రుబ్లెవ్ తన సంఘీభావాన్ని ప్రకటించాడు. కాగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై ప్రత్యక్ష దాడికి దిగిన రష్యా సేనలు శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులకు వచ్చాయి. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించి తమకనుకూల ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలన్నదే పుతిన్ ప్రయత్నమని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. చదవండి: Nick Kyrgios: కుడిచేయిపై కత్తి గాట్లు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న టెన్నిస్ స్టార్ Ukraine-Russia War: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే' Russian tennis player Andrey Rublev writes "No war please" on the camera following his advancement to the final in Dubai. pic.twitter.com/GQe8d01rTd — TSN (@TSN_Sports) February 25, 2022 -
జనవరిలో షరపోవా పునరాగమనం!
రియో డీ జనీరో: రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా వచ్చే ఏడాది నుంచి బరిలోకి దిగే అవకాశముంది. 2017, జనవరిలో షరపోవా రాకెట్ చేతబట్టనుందని రష్యా టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు షామిల్ తార్పిష్చెవ్ తెలిపారు. రియో ఒలింపిక్స్ లో ఆయన ఈ విషయం వెల్లడించారు. 'షరపోవా పునరాగమనంపై సెస్టెంబర్ లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. కచ్చితంగా చెప్పలేను కానీ వచ్చే ఏడాది జనవరి నుంచి ఆమె మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయ'ని షామిల్ చెప్పారు. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన షరపోవా రెండేళ్లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు.